కరోనా వైరస్ మూలాలపై దర్యాప్తు ప్రారంభమైన నేపథ్యంలో చైనాలోని వివాదాస్పద వుహాన్ వైరాలజీ ల్యాబ్‌లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు కీలక విషయాన్ని బయటపెట్టారు. 2017లో ఒక గుహలో నమూనాలు సేకరించే సమయంలో తాము గబ్బిలాల కాటుకు గురయ్యామని అంగీకరించారు.
కోరలు గ్లౌజుల్లోకి చొచ్చుకెళ్లాయి..
అక్కడ కరోనా వైరస్‌కు ఆవాసంగా ఉన్న గబ్బిలాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వాటి కోరలు సూదుల్లా తమ రబ్బరు గ్లౌజుల్లోకి చొచ్చుకెళ్లాయని చెప్పారు. 2017 నాటి కొన్ని వీడియో దృశ్యాలను పరిశీలించినప్పుడు ఈ ల్యాబ్ సిబ్బంది కనీసం గ్లౌజులు మాస్కులు ధరించకుండానే సజీవ గబ్బిలాలను పట్టుకోవడం కనిపించింది.
ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) భద్రతా నిబంధనలకు విరుద్ధం. కరోనా మూలాలపై దర్యాప్తు చేసేందుకు 13 మంది నిపుణులతో కూడిన డబ్ల్యూహెచ్ఓ బృందం ఇప్పటికే బీజింగ్ చేరుకుంది. తాజాగా వెలుగు చూసిన అంశాలపై వీరు దృష్టిసారించే అవకాశాలు ఉన్నాయి.
ఇదీ చదవండి :తీవ్ర కొవిడ్ ముప్పు వారిని గుర్తించే రక్త పరీక్ష