తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచంపై కరోనా పంజా- ఫ్రాన్స్​లో మరో 833మంది

ప్రపంచంపై కరోనా వైరస్​ పంజా విసురుతోంది. ముఖ్యంగా ఫ్రాన్స్​లో ఈ ప్రాణాంతక మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా 833మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 9వేలకు చేరువైంది. అగ్రరాజ్యం అమెరికానూ వైరస్​ కలవరపెడుతోంది. అమెరికాలో 10వేల మందికిపైగా ప్రజలు వైరస్​ బారినపడ్డారు.

WORLDWIDE UPDATES ON CORONA VIRUS PANDEMIC
ప్రపంచంపై కరోనా పంజా- ఫ్రాన్స్​లో మరో 833మంది

By

Published : Apr 7, 2020, 4:55 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ విజృంభిస్తోంది. ప్రపంచ దేశాల్లో రోజురోజుకు పాజిటివ్​ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అటు మృతుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 13,42,480 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం 74,558మంది ప్రాణాలు కోల్పోయారు.

ఫ్రాన్స్​ విలవిల...

వైరస్​తో ఫ్రాన్స్​ విలవిలలాడుతోంది. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 833మంది మరణించారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 8,911కు చేరింది. దేశవ్యాప్తంగా 98,010మంది వైరస్​ బారినపడ్డారు. అయితే ఇది ఆరంభం మాత్రమేనని ఫ్రాన్స్​ ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

అమెరికాలో 10వేలు...

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. దేశంలో మృతుల సంఖ్య 10వేలు దాటింది. అటు పాజిటివ్​ కేసులు(3,64,088) కుడా అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి.

అమెరికాలో వైరస్​ కేంద్రబిందువు న్యూయార్క్​లో పరిస్థితులు ఇంకా విషమంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​ను ఏప్రిల్​ 29వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు గవర్నర్​ ఆండ్రూ కౌమో.

వివిధ దేశాల్లో పరిస్థితి

నార్వేలో మాత్రం...

ఓ వైపు ప్రపంచ దేశాలు కరోనాతో వణికిపోతుంటే.. నార్వే మాత్రం తమ దేశంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ప్రకటించింది. వైరస్​ వ్యాప్తిచెందడం తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. అయితే ఇప్పట్లో ఆంక్షలను సడలించబోమని పేర్కొంది.

ఇదీ చూడండి-కరోనాపై పోరు: భారత్​కు అమెరికా భారీ ఆర్థిక సాయం

ABOUT THE AUTHOR

...view details