తెలంగాణ

telangana

'అతిచిన్న ఆవు'తో ఆ దేశానికి తిప్పలు

By

Published : Jul 9, 2021, 4:17 PM IST

బంగ్లాదేశ్​లోని ఓ ఆవు ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. దానిని చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. ఆ ఆవు ప్రపంచంలోనే అతి చిన్నది అని దాని యజమాని ప్రకటించడమే ఇందుకు కారణం. అయితే వారు కొవిడ్​ నిబంధనలు ఉల్లంఘించి పెద్ద సంఖ్యలో గుమిగూడుతుండటం ఆందోళనకర విషయం.

worlds-smallest-cow
ప్రపంచంలోనే అతి చిన్న ఆవు

బంగ్లాదేశ్​ రాజధాని ఢాకా శివార్లలోని శికోర్​ ఆగ్రో ఫామ్​లో ఉంటుంది రాణి అనే అవు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న(26 అంగుళాల పొడవు) ఆవు అని రాణి యజమాని అంటున్నారు. గిన్నిస్​ బుక్​ రికార్డుల్లో ప్రస్తుతమున్న అతిచిన్న ఆవు కన్నా తన రాణి 4 అంగుళాలు చిన్నదని చెబుతున్నారు. అందువల్ల గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డుల్లో స్థానం కోసం దరఖాస్తు చేసుకున్నారు. జన్యు లోపాల కారణంగా రాణి ఇలా ఉందని, జీవితం మొత్తం ఇలాగే ఉండిపోయే అవకాశాలు ఎక్కువని అంటున్నారు.

ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. కానీ రాణిని చూసేందుకు ప్రజలు తరలివెళుతున్నారు. రాణితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్నారు. మూడురోజుల్లో 15వేల మంది రాణి సందర్శన కోసం వెళ్లారు. దీంతో ఆ ప్రాంతం కొవిడ్​ హాట్​స్పాట్​గా మారే అవకాశాలు పెరిగిపోయాయి. కరోనా ఆంక్షలను లెక్కచేయకుండా ప్రజలు తరలివెళ్లడం ఆందోళకనరం.

రాణిని చూసేందుకు

జూన్​ చివర్లో కరోనా కేసులు, మరణాలు అధికమైన కారణంగా దేశవ్యాప్తంగా కఠినమైన లాక్​డౌన్​ను అమలు చేసింది అక్కడి ప్రభుత్వం. అయినప్పటికీ ప్రజలు ఇలా బయటకు వచ్చి సంచరిస్తుండటం ఆందోళనకరమని ఆ దేశ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:-ఆడ ఏనుగుల మధ్య గొడవ- మగ గజం సయోధ్య!

ABOUT THE AUTHOR

...view details