ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 52 లక్షల 34 వేల 140 మంది వైరస్ బారిన పడ్డారు. కాగా 3,35,730మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. కొవిడ్ నుంచి ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 21 లక్షల 12వేల 123కు చేరింది.
రష్యాలో అత్యధికంగా
రష్యాలో ఒక్కరోజులోనే సూమారు 9,000 కేసులు నమోదయ్యాయి. రోజువారి కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో అత్యధికంగా 150 మంది వైరస్‌తో మృతి చెందారని అక్కడి అధికారులు తెలిపారు. మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 3,26,448కి చేరింది.
బ్రిటన్‌లోనూ..
బ్రిటన్‌లో వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. కొత్తగా 3,287 మందికి వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. దీంతో వైరస్ బారిన పడినవారి సంఖ్య 2,57,482కు పెరిగింది. మరో 351 మంది మృతి చెందగా... మరణాల సంఖ్య 36,744కు చేరుకుంది.
అమెరికాలో
అగ్రరాజ్యం అమెరికాలో ఒక్కరోజులో 1,289 కేసులు నమోదు కాగా.. వైరస్ బాధితలు సంఖ్య 16లక్షల 22వేల191కి చేరింది. గత 24 గంటల్లో 31 మంది మరణించగా.. వైరస్ మృతుల సంఖ్య 96,385కు పెరిగింది.
సౌదీ అరేబియా
కొత్తగా 2,642 కేసులు నమోదు కాగా... మొత్తం బాధితుల సంఖ్య 67,719కి చేరింది. మరో 13 మంది మరణించడం వల్ల మృతుల సంఖ్య 364కు పెరిగింది.
పాకిస్థాన్
గత 24 గంటల్లో 2,603 మందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించగా... కేసుల సంఖ్య 50,694కు పెరిగింది. ఇప్పటివరకు 1,067 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.