తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 1.30కోట్లు దాటిన కరోనా కేసులు - pakistan corona cases

ప్రపంచంపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1.30కోట్లకుపైగా కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్​లో వైరస్​ తీవ్రత అధికంగా ఉంది. తాజాగా వైరస్​ కేసుల సంఖ్య 2.5లక్షలు దాటాయి. సింగపూర్​, నేపాల్​లలోనూ కరోనా వేగంగా విస్తరిస్తోంది.

world wide corona cases
పాక్​లో 2.5 లక్షల మార్క్​ను దాటిన కరోనా కేసులు

By

Published : Jul 13, 2020, 8:46 PM IST

ప్రపంచ దేశాలపై కరోనా వైరస్​ పంజా విసురుతోంది. రోజురోజుకు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అమెరికా, బ్రెజిల్​, రష్యా వంటి దేశాల్లో వైరస్​ ప్రభావం అధికంగా ఉంది. మొత్తం కేసుల సంఖ్య కోటీ 30 లక్షలు దాటింది.

  • మొత్తం కేసులు: 1,30,81,776
  • మరణాలు: 5,72,544
  • కోలుకున్నవారు: 76,24,536
  • యాక్టివ్​ కేసులు: 48,84,696

పాకిస్థాన్​లో.. 2.5లక్షలు

పాకిస్థాన్​లో కరోనా మహమ్మారి విజృభిస్తోంది. తాజాగా మరో 2,769 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,50,000 మార్కు దాటింది. మరో 69మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాలు సంఖ్య 5,226కు చేరింది. 1,61,917 మంది కోలుకున్నారు.

సింగపూర్​లో..

సింగపూర్​లో సోమవారం రికార్డు స్థాయిలో 322కొత్త కోసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 46,283కు చేరింది. అయితే.. ఇప్పటి వరకు 42,285 మంది వైరస్​ను జయించారు. 26 మంది మృతి చెందారు. 3,468 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

నేపాల్​లో..

నేపాల్​లో కరోనా వైరస్​ వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా 144 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 16,945కు చేరింది. అయితే.. కరోనా కేసులతో పాటు వైరస్​ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం ఒక్క రోజే 1,705 మంది కోలుకున్న నేపథ్యంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 6,613కు తగ్గినట్లు తెలిపింది.

అమెరికాలో రికార్డుస్థాయిలో..

ప్రపంచలో ఎక్కడా లేనంతగా అమెరికాలో పరిస్థితులు అత్యంత ఘోరంగా ఉన్నాయి. అమెరికాలో సోమవారం భారీగా కేసులు, మరణాలు నమోదయ్యాయి. రోజువారీగా ఫ్లోరిడాలో సోమవారం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే ఏప్రిల్​లో నమోదైన కేసుల కన్నా ప్రస్తుతం తీవ్రత తక్కువ స్థాయిలోనే ఉన్నట్టు, దానిని నియంత్రించగలమని జాన్​ హాప్కిన్స్​ విశ్వవిద్యాలయం నిపుణులు పేర్కొంటున్నారు. వైరస్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్​ను తప్పనిసరిగా ధరించాలని అధికారులు కోరుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కేసుల వివరాలు..

దేేశం మొత్తం కేసులు మరణాలు
అమెరికా 34,15,554 1,37,797
బ్రిజిల్​ 18,66,176 72,151
రష్యా 7,33,699 11,439
పెరూ 3,26,326 11,870
చిలీ 3,15,041 6,979
స్పెయిన్ 3,00,988 28,403
మెక్సికో 2,99,750 35,006
దక్షిణాఫ్రికా 2,76,242 4,079

ABOUT THE AUTHOR

...view details