తెలంగాణ

telangana

ETV Bharat / international

శ్రీలంక దాడుల్ని ఖండించిన దేశాధినేతలు - church

ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన వరుస బాంబు దాడులను ప్రపంచ నేతలు తీవ్రంగా ఖండించారు. బ్రిటన్​, నెదర్లాండ్స్​​, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రధానులు బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

శ్రీలంక మారణహోమాన్ని ఖండించిన దేశాధినేతలు

By

Published : Apr 21, 2019, 5:20 PM IST

Updated : Apr 21, 2019, 5:47 PM IST

శ్రీలంక దాడుల్ని ఖండించిన దేశాధినేతలు

శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమాన్ని ప్రపంచ దేశాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ దాడి 'నిజంగా భయంకరమైనది' అని బ్రిటన్​ ప్రధాని థెరిసా మే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెదర్లాండ్స్​​, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​ ప్రధానులు బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈస్టర్​ పర్వదినాన శ్రీలంకలోని చర్చిలు, హోటల్లో ఉగ్రవాదుల జరిపిన వరుస బాంబు దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో బ్రిటిష్​, డచ్, అమెరికా పౌరులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జపాన్​ దేశీయులు కొందరు తీవ్రంగా గాయపడ్డారు.

ఏకం కావాలి....

ఉగ్రవాదుల మారణహోమాన్ని బ్రిటన్​ ప్రధాని థెరిసా మే తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని 'నిజంగా భయంకరమైనది' అని పేర్కొన్నారు.

"మనమంతా ఏకం కావాలి. భయపెట్టడం ద్వారా ఎవరూ తమ అభిమతాన్ని మనపై రుద్దలేరని నిరూపించాలి" అని థెరిసా మే అన్నారు.

"శ్రీలంకలోని చర్చ్​లు, హోటళ్లపై జరిగిన దాడులు నిజంగా భయంకరమైనవి. ఈ విషాధ సమయంలో బాధితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను."
- థెరిసా మే, బ్రిటన్ ప్రధాని ట్వీట్​

"శ్రీలంక ప్రజలకు ఆస్ట్రేలియా హృదయపూర్వక సానుభూతి తెలుపుతోంది. ఈ భయంకర సమయంలో శ్రీలంకకు మా పూర్తి మద్దతు, చేయగలగిన సహకారం అందిస్తాం."
- స్కాట్​ మారిసన్​, అస్ట్రేలియా ప్రధాని

"ఉగ్రవాదుల చర్యలను న్యూజిలాండ్ తీవ్రంగా ఖండిస్తోంది. అసువులు బాసిన వారి ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తున్నాం. బాధితులు త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నాం. ఇంత మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు పశ్చాత్తాపం కలిగించాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను."
-జెసిండా ఆర్డెర్న్​, న్యూజిలాండ్​ ప్రధాని

ఇదీ చూడండి: శ్రీలంకలో 8 దాడులు- 165 మంది మృతి

Last Updated : Apr 21, 2019, 5:47 PM IST

ABOUT THE AUTHOR

...view details