పాక్లో అత్యంత ప్రమాదకరమైన బ్రిటన్ తరహా వైరస్ వ్యాప్తి చెందుతోందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఒక్కరోజులోనే అత్యధికంగా 135 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. దీనితో అక్కడ మహమ్మారి ధాటికి మరణించిన వారి సంఖ్య 15,754 కు చేరుకుంది.
పాక్లో కేసులు ఇలా..
- కొత్త కేసులు: 4,681
- మొత్తం కేసుల సంఖ్య: 734,423
- ఇప్పటివరకు కోలుకున్న వారు: 641,912
- యాక్టివ్ కేసుల సంఖ్య: 75,758
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోందని పాక్ ప్రభుత్వం తెలిపింది. రంజాన్ తర్వాత టీకా పంపిణీ కార్యక్రమాన్ని విస్తృతం చేయనున్నట్లు వెల్లడించింది.
"ప్రస్తుతం రోజూ 60-70 వేల మందికి టీకాలు ఇస్తున్నాం. రంజాన్ తర్వాత ఈ సంఖ్యను లక్షా యాభై వేల నుంచి రెండు లక్షలకు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం 9 లక్షల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయి. ప్రజా టీకా కార్యక్రమానికి 150 మిలియన్ డాలర్ల బడ్జెట్ను ఆమోదిస్తూ కేబినెట్ ఆమెదం తెలిపింది".
-అసద్ ఉమర్, ప్రణాళికా మంత్రి
ద.కొరియాలోనూ..
దక్షిణ కొరియాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులు హెచ్చరించారు. బుధవారం అక్కడ 731 కొత్త కేసులు నమోదైనట్లు కొరియా వ్యాధి నియంత్రణ, నివారణ సంస్థ (సీడీసీ) తెలిపింది. దీనితో ద.కొరియాలో మొత్తం కేసుల సంఖ్య 111,419కి పెరిగింది. ఇక కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి 1,782 మరణాలు నమోదైనట్లు సీడీసీ వెల్లడించింది. అక్కడ గడచిన మూడు నెలల్లోనే రెట్టింపయ్యాయంటే పరిస్థితి తీవ్రతను తెలుసుకోవచ్చు.