అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి.. స్థానికంగా పౌర హక్కుల కార్యకర్తలు, న్యాయమూర్తులు, పాత్రికేయులు భయంభయంగా కాలం వెళ్లదీస్తున్న విషయం తెలిసిందే! ముఖ్యంగా మహిళల పరిస్థితి దీనంగా మారింది. తమను తాలిబన్లు వేటాడుతున్నారంటూ, ప్రాణభయం ఉందంటూ చాలామంది ఇది వరకే వాపోయారు. కొందరు దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు.
తాజాగా ఇదే ప్రయత్నాల్లో ఉన్న మహిళా హక్కుల కార్యకర్త ఫ్రోజన్ సఫీ(29)తో సహా నలుగురు మహిళలను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపడం స్థానికంగా చర్చనీయాంశమైంది. బాల్ఖ్ ప్రావీన్స్‌లోని మజారే షరీఫ్‌లో వీరు హత్యకు గురయ్యారు. ఓ ఇంట్లో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయని తాలిబన్ల అధికార ప్రతినిధి ఖరీ సయ్యద్ ఖోస్త్ తెలిపారు. ఈ వ్యవహారంలో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారిని తామే ఆహ్వానించినట్లు నిందితులు విచారణలో అంగీకరించారన్నారు.
ఇటీవల తాలిబన్ల పాలన మొదలయ్యాక.. ఓ మహిళా హక్కుల కార్యకర్త హత్యకు గురికావడం ఇదే మొదటిసారి! అక్టోబరు 20న ఇంటినుంచి బయటకు వెళ్లిన ఆమె.. తాజాగా మృతదేహమై తేలారు.
'దుస్తులను బట్టి గుర్తించాం..'