తెలంగాణ

telangana

ETV Bharat / international

'అత్యాచారాలకు కారణం పొట్టి దుస్తులు ధరించడమే' - పొట్టి దుస్తులపై ఇమ్రాన్ ఖాన్

అత్యాచారాలు జరగడానికి కారణం మహిళలు దుస్తులు ధరిచే విధానమే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు, ప్రముఖులు మండిపడుతున్నారు.

Imran khan, Pak PM
ఇమ్రాన్ ఖాన్, పాక్ ప్రధాని

By

Published : Jun 22, 2021, 5:40 PM IST

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. దేశంలో అత్యాచారాలు జరగడానికి కారణం.. మహిళలు దుస్తులు ధరించే విధానమే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పొట్టి దుస్తులు పురుషులను ఆకర్షిస్తాయని.. ఈ నేపథ్యంలో అత్యాచారాలు జరుగుతున్నాయని ఓ టీవీ ఇంటర్యూలో అన్నారు.

"ఓ మహిళ పొట్టి దుస్తులు ధరించింది అంటే.. సాటి పురుషుడిని అది ప్రభావితం చేస్తుంది. ఎలాంటి ఆకర్షణలకు గురవ్వకుండా ఉండడానికి వాళ్లేం రోబోలు కాదుగా."

--ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ప్రధాని.

గతంలోనూ ఇమ్రాన్​.. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. 'అశ్లీలత' అత్యాచారాలకు దారితీస్తుందని అన్నారు. అయితే.. ప్రస్తుతం ఇమ్రాన్​ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. కొందరు అధికారులు సైతం ఇమ్రాన్​ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్​ చేశారు.

"పాకిస్థాన్​లో అత్యాచారాలు జరుగుతుండడానికి కారణం మహిళలే అని నిందలు మోపడం బాధాకారం. పురుషులు రోబోలు కాదని, పొట్టి దుస్తుల్లో మహిళలను చూస్తే వారు టెంప్ట్ అవుతారని ఇమ్రాన్​ అన్నారు. ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు."

--రీమా ఒమర్. అధికారి.

ఇమ్రాన్​ వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

పెళ్లికి సిద్ధమైన ఇమ్రాన్ ఖాన్, రేఖ!

ఆక్రమిత కశ్మీర్​లో పాక్‌ కుట్ర!

ABOUT THE AUTHOR

...view details