అఫ్గాన్ ప్రభుత్వానికి తాలిబన్లకు మధ్య త్వరలో జరగనున్న చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాలిబన్లతో జరిగే చర్చల్లో తొలిసారి ఒక మహిళ పాల్గొనటమే ఇందుకు కారణం. అఫ్గానిస్థాన్ పార్లమెంట్ సభ్యురాలు ఫౌజియా కోఫీ తాలిబన్లతో చర్చించి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేయనున్నారు.
తాలిబన్లతో జరపబోయే చర్చల్లో ఆమె ఎలాంటి అంశాలను ప్రస్తావించనున్నారు? యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన మహిళలకు ఆమె ఎలాంటి భరోసాను అందిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. వీటిని తెలుసుకునేందుకు ఫౌజియా కోఫీతో ఈటీవీ భారత్ ముఖాముఖి నిర్వహించింది.
ప్రశ్న:అఫ్గానిస్థాన్ రాజకీయ ప్రక్రియలో మిమ్మల్ని ఎప్పుడూ సమానంగా అంగీకరించని తాలిబన్లతో మీరు చర్చల కోసం వేదిక పంచుకోబోతున్నారని విన్నాను. ఈ పురోగతిపై మీ అభిప్రాయం ఏంటి?
ఫౌజియా: నేను అఫ్గానిస్థాన్ మహిళగా ఉన్నాను, నేను తాలిబన్ ప్రభుత్వానికి బాధితురాలిని కూడా. విద్య, ఆరోగ్యం, సామాజిక, రాజకీయ భాగస్వామ్యంతో సహా ప్రాథమిక హక్కులను మేము కోల్పోయాము. మహిళలు మరోసారి యుద్ధానికి బలికావడం నాకు ఇష్టం లేదు. కాబట్టి మహిళలు చర్చల్లో భాగస్వామ్యం కావటం చాలా ముఖ్యం. ఈ చర్చలలో పాల్గొనడం ద్వారా ప్రాథమికంగా మేము నిషేధాలను విచ్ఛిన్నం చేస్తాం. ఎందుకంటే ఇవి తాలిబన్ల విషయంలోనే కాదు అఫ్గానిస్థాన్ చరిత్రలోనే ఉన్నాయి. ఇప్పటివరకూ శాంతి చర్చలన్నీ పురుషులు మధ్య మాత్రమే జరిగాయి. ఇప్పుడు చారిత్రక సమస్యను పరిష్కార వేదికలో నేను ఉన్నందుకు గొప్పగా భావిస్తున్నాను, ఇది నాపై ఎంతో బాధ్యతను పెంచింది.
ప్రశ్న:పార్లమెంటులో, వెలుపల మహిళలకు సమాన హక్కులను తీసుకువస్తారన్న దానిపై మీరు ఎంత వరకు ఆశాజనకంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో మహిళల హక్కుల కోసం, ఆడపిల్లల విద్య హక్కులు, ఆడపిల్లలు-మహిళల అభివృద్ధి ఎలా ఉండనుంది?
ఫౌజియా :ఒక నిర్దిష్ట దృష్టి కోణం ఆధిపత్యం వహించే దేశం అఫ్గానిస్థాన్ కాదు. అది అతివాదమైనా కావచ్చు, లేదా ఉదారవాదమైనా కావచ్చు. మితవాద దృక్పథాన్ని మనం అనుసరించాలి. ఇస్లాం చెప్పే మితవాద నిర్వచనాన్ని తీసుకోవాలి. మన చుట్టుపక్కల వారితో శాంతియుతంగా జీవించగలిగే అఫ్గానిస్థాన్ కోసం మేము పోరాడుతున్నాము. స్త్రీ పురుష బేధాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా సూచించే అఫ్గానిస్థాన్ మాకు కావాలి. విద్య అనేది అఫ్గానిస్థాన్ మహిళలకే కాకుండా పురుషులకు కూడా ఎంతో ముఖ్యం. విద్య లేకుండా ఎటువంటి పురోగతిని సాధించలేము. మేము దోహాలో ఉన్నాము, అనుసరించాల్సిన నియమాలు విధానాలు ఇతర సాంకేతిక సమస్యల గురించి చర్చిస్తున్నాం, ఎందుకంటే మేము పునాదిని సరిగ్గా వేయాలి. చర్చలకు సరైన పునాది వేసినప్పుడే చర్చలు సులభతరం అవుతాయి. చర్చల మెుదటి దశలో మహిళల హక్కులను చర్చించబోం. ఎందుకంటే సున్నితమైన సమస్యలలో ఇదీ ఒకటి. ప్రతి ఒక్కరూ శాంతి సామరస్యాలతో జీవించేందుకు అనువైన ప్రాంతాన్ని సృష్టించాలనుకుంటున్నాము.
ప్రశ్న:ప్రారంభంలో తాలిబన్ అన్ని రాజకీయ పార్టీలకు అఫ్గానిస్థాన్‌లో ఇస్లామిక్ చట్టం కావాలని స్పష్టం చేసింది. ఇతర పార్టీలు దానిపై ఎలా స్పందిస్తున్నాయి. మీరు దేశాన్ని కొత్తగా ఎలా చూడాలనుకుంటున్నారు?