ప్రపంచాన్నే భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది అందమైన చెర్రీ పూలు వికసించే కాలాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు చైనా ప్రజలు దూరమవుతున్నారు. కొవిడ్- 19 కారణంగా షాంఘై చెన్షాన్ బొటానికల్ గార్డెన్‌ను జనవరి 24 నుంచి తాత్కాలికంగా మూసివేశారు. కానీ, పరోక్షంగా ఇంటర్నెట్ ద్వారా ఆ అందాలను వీక్షించే అవకాశాన్ని కల్పించారు అధికారులు.
షాంఘై చెన్షన్ బొటానికల్ గార్డెన్ అందాలను ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోల రూపంలో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. దీని వల్ల ప్రజలు తమ ఇళ్ల నుంచే వీటిని వీక్షిస్తున్నారు. సాధారణంగా పర్యటకులు నేరుగా సందర్శించే సమయంలో వృక్ష శాస్త్రజ్ఞులు ఈ గార్డెన్ చుట్టూ వారితో పాటు నడుస్తూ వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి వివరించే వారు.
" కరోనా వైరస్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో నిత్యం సందడిగా ఉండే షాంఘై చెన్షాన్ బొటానికల్ గార్డెన్ పరిసరాలు ఈ ఏడాది బోసిపోయాయి. అయితే ప్రజలకు ఆ అనుభూతిని అందించాలని భావించాం. అందుకు ఈ ఏడాది పరోక్షంగా ఆ అందాలను చూసే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించి ఆన్లైన్ సేవలు ప్రారంభించాం. దీంతో ప్రజలు తమ చరవాణిల ద్వారా ఈ పరిసరాలను చూస్తూ ఇతరులకు చూపిస్తారు."