తాలిబన్లను, ఇతర ఉగ్రవాద సంస్థలను భారత్‌పైకి ఎలా ఉసిగొల్పాలా అని ఆలోచిస్తున్న పాకిస్థాన్.. అందులో భాగంగా ఐసిస్-కె (ఖోరాసన్)వైపు(ISIS news) దృష్టి పెట్టింది. ఇటీవల అఫ్గాన్ ప్రభుత్వ దళాలపై తాలిబన్లు(Afghanistan Taliban) చేసిన దాడుల సందర్భంగా వివిధ కారాగారాల నుంచి ఖైదీలు తప్పించుకున్నారు. కొందరిని తాలిబన్లే విడుదల చేశారు.
ఈ సందర్భంగా చాలా మంది ఐసిస్-కె ఉగ్రవాదులు(ISIS news) తప్పించుకున్నారు. వీరిలో కేరళ నుంచి అఫ్గాన్ వెళ్లి ఐసిస్-కెలో చేరిన 25 మంది భారతీయులూ ఉన్నారు. వీరిని జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలకు ఉపయోగించుకోవాలని పాకిస్థాన్ ప్రణాళిక రచిస్తోందని భారత నిఘా వర్గాలు తెలిపాయి.