Kalapani Dispute: నేపాల్‌తో కాలాపానీ, లిపులేఖ్ సరిహద్దు వివాదం నేపథ్యంలో(India Nepal Border Dispute).. ఆ దేశ మాజీ ప్రధాని, కమ్యునిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) ఛైర్మన్ కేపీ శర్మ ఓలి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే.. వివాదస్పద భూభాగాలైన కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్‌లను చర్చల ద్వారా భారత్ నుంచి వెనక్కి తీసుకుంటామని చెప్పారు. కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ నేపాల్ 10వ సాధారణ సమావేశంలో ఓలి ఈ వ్యాఖ్యలు చేశారు.
"మేము అధికారంలోకి వస్తే.. వివాదస్పద ప్రాంతాలైన కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్‌లను చర్చల ద్వారా భారత్ నుంచి వెనక్కి తీసుకుంటాం. సమస్యలను చర్చలతోనే పరిష్కరిస్తాం తప్ప సరిహద్దు దేశాలతో శత్రుత్వాన్ని పెంచుకోం. వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల్లో అతిపెద్ద రాజకీయ శక్తిగా సీపీఎన్-(యూఎంఎల్)పార్టీ ఆవిర్భవిస్తుంది."
-- కేపీ శర్మ ఓలి, నేపాల్ మాజీ ప్రధాని
నేపాల్ స్వాతంత్య్రాన్ని, సార్వభౌమత్వాన్ని రక్షించే విధంగా తమపార్టీ పనిచేస్తుందని ఓలీ తెలిపారు. ఇరుదేశాల ఆసక్తి, లాభాలను దృష్టిలో ఉంచుకునే అంతర్జాతీయ సంబంధాలు ఏర్పరచుకుంటామన్నారు.
దేశాభివృద్ధి కోసం..
నేపాల్ అభివృద్ధి కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా ముందుకురావాలని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా పిలుపునిచ్చారు. రూల్‌ఆఫ్ లా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, దేశాభివృద్ధి అన్నిపార్టీల అజెండాగా ఉండాలన్నారు. నేపాల్‌లోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు, బంగ్లాదేశ్, భారత్, కాంబోడియా, శ్రీలంకకు చెందిన అధికార ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత్ నుంచి భాజపా నాయకుడు, మాజీ మంత్రి హర్ష్వర్ధన్ పాల్గొన్నారు.
ఏంటీ వివాదం..?