తాలిబన్లపై(Afghanistan Taliban) సింహగర్జన చేస్తున్న పంజ్‌షేర్(Punjshir vally) కోటకు బీటలు వారేలా కనిపిస్తున్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి. వనరుల లేమి దృష్ట్యా ముష్కర మూకతో పోరాటం, ఆపి సయోధ్య కుదుర్చుకోవాలని ఆ ప్రాంత పెద్దలు భావిస్తున్నారన్న విశ్లేషణలు వినిపించాయి. అయితే.. ఆ వార్తలు నిజం కాదని తేల్చి చెబుతున్నారు పంజ్‌షేర్ సైనికులు. తాలిబన్లతో రాజీపడే ఉద్దేశమే లేదని, యుద్ధానికి సిద్ధమని స్పష్టం చేశారు.
గతంలో తాలిబన్లపై సాధించిన విజయాలను గుర్తుచేస్తూ.. 'వారిని పాతాళానికి తొక్కేస్తాం' అని పంజ్‌షేర్ నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు(ఎన్ఆర్ఎఫ్) చెందిన ఓ సైనికుడు బుధవారం పేర్కొన్నట్లు అఫ్గాన్ ఖామా ప్రెస్ పేర్కొంది. ఇతర సైనికులు అందుకు మద్దతు పలుకుతూ.. తమ చేతులు పైకి ఎత్తి ' అల్లాహో అక్బర్' అంటూ నినాదాలు చేశారు. తమ కంచుకోటపై తాలిబన్ల దాడిని నిరోధించే ప్రయత్నంలో భాగంగా ఎన్ఆర్ఎఫ్ బలగాలు(panjshir resistance).. మిషన్ గన్, మోర్టార్లతో కూడిన రక్షణ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే.. అమెరికా తయారు చేసిన హమ్వీస్, పికప్ ట్రక్కుల్లో ఆయుధాలతో తమ ప్రాంతంలోకి ఎవరూ రాకుండా పహారా కాస్తున్నారు.
పంజ్‌షేర్ సింహంగా పేరున్న అహ్మద్ షా మసూద్ తనయుడు అహ్మద్ మసూద్ నేతృత్వంలో.. అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లాహ్ సలేహ్ మద్దతుతో.. తాలిబన్లపై పోరాటం సాగిస్తున్నారు.
తోకముడిచిన తాలిబన్లు..