Russia Ukraine War: ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరతానని పట్టుబట్టడమే ప్రస్తుత యుద్ధానికి కారణంగా మారింది. ఆ కూటమిలో ఉక్రెయిన్ చేర్చుకోమని హామీ ఇవ్వాలంటూ అమెరికా, నాటోపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతోంది. అసలు నాటో అంటే రష్యాకు ఎందకంత ద్వేషం. ఆ కూటమి దళాలు తమ సరిహద్దుల్లోకి చేరతాయంటే పుతిన్ ససేమీరా అంగీకరించడంలేదు. దీనికి రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి జరిగిన పలు పరిణామాలు కారణంగా నిలిచాయి.
Russia Ukraine Crisis
1939-45 వరకు జరిగిన రెండో ప్రపంచ యుద్ధం గెలిచాక తూర్పు యూరప్‌లోని చాలా ప్రాంతాల నుంచి సోవియట్ సేనలు వైదొలగేందుకు నిరాకరించాయి. 1948లో బెర్లిన్‌ను పూర్తిగా చుట్టుముట్టాయి. దీంతో సోవియట్‌ను కట్టడి చేయడానికి కూటమిగా ఏర్పడాలని 12 దేశాలు భావించాయి. 1949లో ఇది కార్యరూపం దాల్చింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, ది నెదర్లాండ్స్, ఐస్‌ల్యాండ్, బెల్జియం, లక్సమ్‌బర్గ్, నార్వే, పోర్చుగల్, డెన్మార్క్‌లు సభ్యదేశాలుగా ఉన్నాయి. కానీ, ఇప్పుడు నాటో దాదాపు 30 దేశాలకు సభ్యత్వం ఉంది. ఈ దేశాలు మొత్తం సమష్టిగా భద్రతా బాధ్యతలను పంచుకొంటాయి. ఒక నాటో సభ్యదేశంపై దాడి జరిగితే అది 30 సభ్యదేశాలపై దాడిగా పరిగణిస్తారు. అన్ని దేశాలు ఆ దురాక్రమణదారుపై విరుచుకుపడతాయి.
సోవియట్ దేశాలకు సభ్యత్వం ఇవ్వడం..
1991 డిసెంబర్ 25న సోవియట్ పతనమైంది. మొత్తం 15 కొత్త దేశాలు ఆవిర్భవించాయి. రష్యా, అర్మేనియా, అజర్‌బైజన్, బెలారస్, ఎస్తోనియా, జార్జియా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, లాత్వియా, లిథువేనియా, మాల్డోవా, తజకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్థాన్ వీటిల్లో ఉన్నాయి. దీంతో ప్రపంచంలో అమెరికా ఒక్కటే సూపర్ పవర్‌గా నిలిచింది. దాని నేతృత్వంలోని నాటో కూటమి వేగంగా సభ్యదేశాలను పెంచుకొంటూ విస్తరించింది. ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా 2004లో నాటోలో చేరాయి. 2008లో ఉక్రెయిన్, జార్జియాలకు నాటో సభ్యత్వం ఇస్తామని చెప్పినా తీసుకోలేదు. నాటో విస్తరణపై పుతిన్ అభ్యంతరం తెలిపారు.
Russia declares war on Ukraine
రష్యా వర్సెస్ నాటో..