'సింతియా డాన్ రీచి'.. ప్రస్తుతం కరోనా వైరస్‌ను మించి ఈ మహిళ పేరు పాకిస్థాన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్కడి అగ్రనేతల తెర వెనుక వ్యవహారాలను ఒక్కొక్కటి వెలుగులోకి తెస్తూ కొందరి రాజకీయ భవిష్యత్తుకు సమాధి కడుతోంది. ప్రతిపక్షమైన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అగ్రనేత బిలావల్ భుట్టో రాజకీయ జీవితానికి ‘సింతియా’ ఎర్త్ పెడుతోంది.
ఎవరీ సింతియా..?
అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన సింతియా డాన్ రిచి వివిధ రకాలపై ఒక షార్ట్‌ఫిల్మ్ మేకర్, యూట్యూబర్, ఎన్‌జీవోలో పనిచేస్తోంది. అంతేకాదు.. స్టార్టప్ కన్సల్టెంట్, కీలక నేతలకు అడ్వైజర్ ఇలా పలు అవతరాల్లో దర్శనమిస్తుంది. పాకిస్థాన్ పవర్ కారిడార్‌లో ఆమెకు దాదాపు ఎదురులేదనే చెప్పాలి. ఉద్రిక్త సమయాల్లో కూడా పాకిస్థాన్ రహస్య సైనిక స్థావరాలకు, ప్రధాని నివాసానికి, అధ్యక్షుని బంగ్లాకు, మంత్రుల నివాసాలకు వెళ్ళగలిగే చొరవ ఉంది.
మంత్రి అత్యాచారం చేశాడు..
- పాకిస్థానీ పీపుల్స్ పార్టీకి చెందిన కీలక నేతలపై ఆమె తీవ్రమైన ఆరోపణలు చేసింది. "మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో తన భర్త ఆసీఫ్ అలీ జర్దారీతో సంబంధాలు పెట్టుకొన్న మహిళలపై సెక్యూరిటీ గార్డులతో అత్యాచారాలు చేయించేది" అని వెల్లడించింది. పాకిస్థాన్‌లో ఓ పెద్ద కుటుంబంలో ఇటువంటి ఘటన జరిగినప్పుడు ఈ విషయాన్ని గుర్తుకు తెచ్చుకొంది. ఈ ట్వీట్ ఒక్కసారిగా కలకలం రేపింది. బిలావల్ భుట్టో వ్యక్తిగత జీవిత రహస్యాలను బయటకు వెల్లడించింది. దీంతో పీపీపీ పార్టీ ఆమెపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
- 2011లో పాకిస్థాన్ ఇంటీరియర్ మంత్రి రెహ్మాన్ మాలిక్ తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపించింది. "నా వీసా కోసం నేను ఇంటీరియర్ మంత్రి బంగ్లాకు వెళ్లాను. అక్కడ నాకు పూలు, మత్తుపదార్థాలు కలిపిన పానీయం ఇచ్చారు. నేను ఈ విషయాన్ని అమెరికా దౌత్యకార్యాలయంలోని వారికి చెప్పాను. కానీ, ఇరుదేశాల సంబంధాలు దృష్ట్యా వారు పెద్దగా స్పందించలేదు" అని ట్వీట్ చేసింది.
- మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ, నాటి ఆరోగ్య శాఖ మంత్రి ముఖ్దుం షాబుద్దీన్‌లు అధ్యక్ష భవనంలో తనతో అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొంది.
- పాక్ నాయకులు యువతులతో కలిసి పార్టీలు చేసుకొంటున్న ఫొటోలను బయటపెట్టింది.
అమెరికా యువతికి పాక్‌లో పనేంటి..?