తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా గుట్టుపై డబ్ల్యూహెచ్​ఓకు చైనా సహకారం

కరోనా గుట్టు విప్పేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) బృందం చేస్తోన్న కృషిలో.. వుహాన్​లోని వైరాలజీ సంస్థను సందర్శించడం అత్యంత కీలక పరిణామం. అయితే.. బుధవారం జరిగిన ఈ సందర్శనలో డబ్యూహెచ్​ఓ నిపుణులకు చైనా అధికారులు సంపూర్ణ సహకారం అందించారని తెలుస్తోంది.

WHO team in Wuhan
'వుహాన్'లో డబ్యూహెచ్​ఓ టీమ్​కు సహకరించిన చైనా

By

Published : Feb 4, 2021, 7:20 PM IST

కరోనా మూలాలపై పరిశోధనలో భాగంగా.. వుహాన్​లో పర్యటిస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) బృందానికి చైనా అధికారుల నుంచి సంపూర్ణ సహకారం లభించింది. ఈ మేరకు ఈ బృందంలోని జంతుశాస్త్ర నిపుణుడు పీటర్ డస్జాక్​ తెలిపారు. వైరస్​ పుట్టుకకు మూలకేంద్రంగా భావిస్తోన్న వుహాన్​ నగరంలోని వైరాలజీ సంస్థను ఈ బృందం బుధవారం సందర్శించింది.

వుహాన్​ వైరాలజీ సంస్థ డిప్యూటీ డైరెక్టర్​ షీ జెంగ్లీతో జరిగిన సమావేశాన్ని ట్విట్టర్​ వేదికగా డస్జాక్​ కొనియాడారు. చర్చలు స్పష్టమైన వాతావరణంలో జరిగాయని తెలిపారు. 2003లో సార్స్​ వైరస్​ వ్యాప్తి మూలాలను కనుగొనడంలో షీ జెంగ్లీ కీలక పాత్ర పోషించారు. అంతకుముందు.. వైరాలజీ సంస్థ బయట వేచి ఉన్న మీడియా సిబ్బందిని డస్జాక్​ ప్రశంసించారు. ప్రపంచానికి ఈ సమాచారాన్ని చేరవేసేందుకు వాళ్లు పడుతున్న కృషిని ఆయన అభినందించారు. వైరాలజీ సంస్థతో పాటు వివిధ ఆసుపత్రులను, పరిశోధ సంస్థలను 10 మందితో కూడిన డబ్యూహెచ్ఓ నిపుణుల బృందం ఇదివరకే సందర్శించింది.

ఇదీ చదవండి:​టీకా కోసం 'సీరం'తో యూనిసెఫ్​ డీల్​

ABOUT THE AUTHOR

...view details