కరోనా ఆవిర్భావంపై డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం సభ్యుడు పీటర్ బెన్ ఎంబారెక్ కీలక ప్రకటన చేశారు. చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయి ఉండకపోవచ్చని తెలిపారు. ఇతర జంతువుల నుంచే మానవుల్లోకి ప్రవేశించి ఉండొచ్చని పేర్కొన్నారు.
చైనాలోని వుహాన్ నగరం నుంచే కరోనా ఉద్భవించిందన్న ఆరోపణల నేపథ్యంలో ఇక్కడ దర్యాప్తు చేసిన నిపుణులు.. దీనిపై సమగ్ర వివరాలను వెల్లడించారు బెన్. వుహాన్‌లో 2019 డిసెంబర్‌కు ముందే కరోనా భారీ స్థాయిలో వ్యాపించిందనేందుకు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని తెలిపారు. వుహాన్‌లో కానీ, మరేచోటైనా కానీ డిసెంబర్‌కు ముందే భారీ వ్యాప్తికి జరిగిందనే ఆధారాల్లేవని అన్నారు.