తెలంగాణ

telangana

ETV Bharat / international

పంజ్​షేర్​ తాలిబన్లదేనా? ఈ ఫొటోల సంగతేంటి?

పంజ్​షేర్​ను ఆక్రమించుకున్నామని తాలిబన్లు (Panjshir valley news) చెబుతుంటే.. అక్కడి పోరాట యోధుల స్పందన మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటోంది! చర్చలకు సిద్ధంగా ఉన్నామని పంజ్​షేర్ నేతలు చెబుతున్నారు. అసలు ఇంతకీ పంజ్​షేర్ ఇప్పుడు (Panjshir control) ఎవరి అధీనంలో ఉంది? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ చిత్ర కథనం.

AFGHANISTAN NEWS
పంజ్​షేర్​ తాలిబన్లదేనా.. ఈ ఫొటోల సంగతేంటి?

By

Published : Sep 9, 2021, 12:54 PM IST

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు (Afghan Taliban) పూర్తిగా తమ వశం చేసుకున్నప్పటికీ.. పంజ్​షేర్ రాష్ట్రంపై ఎవరిది పైచేయి (Panjshir control) అనే విషయంపై సందిగ్ధం ఉండేది. ఈ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు తాలిబన్లు ప్రకటించగా.. పోరు కొనసాగుతోందని (panjshir conflict) పంజ్​షేర్ నేతలు ప్రకటనలు చేయడం ఇందుకు కారణం. తర్వాత చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు పంజ్​షేర్ నేతలు తెలిపారు.

దీంతో పంజ్​షేర్ ప్రస్తుతం ఎవరి అధీనంలో ఉందనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే, తాజాగా బయటకు వచ్చిన ఫొటోలను బట్టి.. ఈ ప్రాంతాన్ని తాలిబన్లు చేజిక్కించుకున్నారని అర్థమవుతోంది. పంజ్​షేర్​కు వెళ్లే ప్రవేశ ద్వారం వద్ద తాలిబన్లు పహారా కాస్తున్నారు. ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ వారు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. కీలక ప్రాంతాలన్నీ వారి కనుసన్నల్లోనే ఉన్నాయి.

పంజ్​షేర్​లో తాలిబన్లు... 'చిత్రమాలిక'

పంజ్​షేర్ గేట్ వద్ద తాలిబన్లు
పంజ్​షేర్ ప్రావిన్సులో తాలిబన్ సైన్యం పెట్రోలింగ్
పంజ్​షేర్ ప్రావిన్స్: ఫొటోలకు ఫోజులు ఇస్తున్న తాలిబన్ సైనికుడు
పంజ్​షేర్ రాష్ట్రంలో పహారా కాస్తున్న తాలిబన్ సాయుధులు
పంజ్​షేర్ ప్రావిన్స్: ఫొటోలకు ఫోజులు ఇస్తున్న తాలిబన్ సైనికులు
పంజ్​షేర్ ప్రావిన్స్: ఫొటోలకు ఫోజులు ఇస్తున్న తాలిబన్ సైనికులు
పంజ్​షేర్ ప్రాంతంలో తాలిబన్లు
పంజ్​షేర్ రాష్ట్రంలోని షోతల్ జిల్లాలో తాలిబన్ల కాపలా
కపిస రాష్ట్రంలో అఫ్గాన్ సైనికులతో తాలిబన్లు
కపిస రాష్ట్రంలో లొంగిపోయిన అఫ్గాన్ సైనికుడితో తాలిబన్ దళాలు

ఇదీ చదవండి:నిరసనలు ఆపేయండి.. పౌరులకు తాలిబన్ల హుకుం

ABOUT THE AUTHOR

...view details