కరోనా మహమ్మారి పుట్టుకకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చేపట్టనున్న పరిశోధనలో కీలక ముందడుగు పడింది. డబ్ల్యూహెచ్ఓకు చెందిన 10 మంది నిపుణులతో కూడిన బృందం.. చైనాలోని వుహాన్ విమానాశ్రయానికి చేరుకుంది. వుహాన్ నగరంలో ఈ బృందం పరిశోధన చేపట్టనుంది. అయితే.. ఆ దేశంలోని కొవిడ్ నిబంధనల ప్రకారం నేటి నుంచి 14 రోజుల పాటు వీరు క్వారంటైన్లో ఉండాలి.
వుహాన్ చేరుకున్న డబ్ల్యూహెచ్ఓ బృందం - వుహాన్‌లో డబ్ల్యూహెచ్ఓ బృందం
కరోనా వైరస్ మూలాలను కనుగొనేందుకు గాను.. డబ్ల్యూహెచ్ఓకు చెందిన బృందం చైనాలోని వుహాన్‌కు చేరుకుంది. 14 రోజుల పాటు క్వారంటైన్ అనంతరం ఈ బృందం విస్తృత స్థాయి పరిశోధన చేపట్టనుంది.
వుహాన్‌కు చేరుకున్న డబ్ల్యూహెచ్ఓ బృందం
ఈ క్వారంటైన్ సమయంలో వైరస్‌కు పుట్టుకకు సంబంధించిన పలు విషయాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చైనా వైద్య నిపుణులతో డబ్ల్యూహెచ్ఓ బృందం చర్చించనుంది. అయితే.. కరోనా మూలాలు కనుగొనేందుకు డబ్ల్యూహెచ్ఓ జరుపుతున్న ఈ పరిశోధన శాస్త్రీయంగా ప్రశ్నార్థకం అని చైనా జాతీయ వైద్య కమిషన్ పేర్కొంది. ఇదే తరహా పరిశోధనలు అన్ని దేశాల్లోనూ జరగాలని వాదిస్తోంది.
ఇదీ చదవండి:పండుగల వేళ చైనాలో భారీగా కరోనా కేసులు