కజఖిస్థాన్లో ఇటీవల బయటపడిన గుర్తుతెలియని న్యుమోనియా సంబంధిత వ్యాధి కరోనానే అయి ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది. కొవిడ్-19 వల్లే ఆ వ్యాధి వ్యాప్తి చెంది ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగం చీఫ్ డా. మిచెల్ ర్యాన్.
"కొత్త న్యుమోనియా వ్యాధి సోకిన వారికి కరోనా నెగిటివ్ వచ్చిన నేపథ్యంలో తప్పుడు ఫలితాలు లేవని నిర్ధరించుకోవడానికి.. కొవిడ్-19 పరీక్షలు, వాటి నాణ్యతపై దృష్టిసారించాం. ఎక్కువ శాతం న్యుమోనియా కేసులు కరోనానే కావచ్చు. సరిగ్గా నిర్ధరణ కాలేదు అంతే."