తెలంగాణ

telangana

ETV Bharat / international

మరో చైనా టీకాకు డబ్ల్యూహెచ్​ఓ ఆమోదం - COVID-19 vaccine Sinovac

చైనా రెండో టీకా సినోవాక్​కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదముద్ర లభించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ వ్యాక్సిన్ ఉందని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది.

who sinovac approval
చైనా కరోనా టీకా

By

Published : Jun 1, 2021, 10:29 PM IST

చైనాలో తయారు చేసిన రెండో కరోనా టీకా 'సినోవాక్'​ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) మంగళవారం ఆమోదం తెలిపింది. భద్రత, సామర్థ్యం, తయారీకి ఈ వ్యాక్సిన్​ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని వివరించింది.

సినోవాక్​ను బీజింగ్​కు చెందిన ఫార్మా సంస్థ సినోవాక్ బయోటెక్​ తయారు చేసింది. చైనా తయారు చేసిన తొలి కొవిడ్ టీకా సినోఫార్మ్​ అత్యవసర వినియోగానికి మే7న డబ్ల్యూహెచ్​ఓ ఆమోదం తెలిపింది.

ఇదీ చూడండి:చైనా వస్తువులే కాదు టీకా కూడా నాసిరకమే!

ABOUT THE AUTHOR

...view details