ఐక్యరాజ్య సమితి(ఐరాస) స్థాపించి 75ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్... ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. తమ దేశం తయారు చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ 'స్పుత్నిక్-వీ'ని ఐరాస, దాని అనుబంధ సంస్థల సిబ్బందికి ఉచితంగా వేయిస్తామన్నారు.
"ఐరాస కార్యాలయ సిబ్బందికి అవసరమైన సహాయం చేయడానికి రష్యా సిద్ధంగా ఉంది. ముఖ్యంగా మా టీకాను ఐరాస ఉద్యోగులకు, వ్యాక్సిన్ కోసం స్వచ్ఛందంగా పనిచేసే దాని అనుబంధ సంస్థలకు ఉచితంగా సరఫరా చేయాలని ప్రతిపాదించాం."