తెలంగాణ

telangana

ETV Bharat / international

'చైనా తుపాకుల కన్నా మా సత్యమే శక్తిమంతం' - Bihar Bodhgaya visitors

చైనా తుపాకులపై తమ సత్యమే గెలుస్తుందన్నారు బౌద్ధమత గురువు దలైలామా. బోధ్​గయలోని మహాబోధి ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

We will fight Chinas power of the gun with the power of   truth: Dalai Lama
'చైనా తుపాకుల కన్నా మా సత్యమే శక్తిమంతం'

By

Published : Dec 25, 2019, 9:09 PM IST

Updated : Dec 25, 2019, 10:48 PM IST

చైనా తుపాకుల కన్నా మా సత్యమే శక్తిమంతం

చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వంతో తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని బౌద్ధమత గురువు దలైలామా అన్నారు. చైనా వద్ద తుపాకులు ఉంటే.. తమ దగ్గర సత్యం అనే శక్తిమంతమైన ఆయుధం ఉందని వ్యాఖ్యానించారు. ఎప్పటికైనా తుపాకులపై సత్యమే విజయం సాధిస్తుందన్నారు. బిహార్‌ బోధ్‌గయలోని మహాబోధి ఆలయ సందర్శన సందర్భంగా... ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"చైనాలో అధిక సంఖ్యలో టిబెటియన్​ బౌద్ధులున్నారని మూడేళ్ల క్రితం నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. అక్కడ చాలామంది పౌరులు టిబెటన్లు అనుసరిస్తోన్న బౌద్ధమతాన్నే ఆచరిస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఉన్న విద్యావంతులు అధిక సంఖ్యలో బౌద్ధులే."

-దలైలామా, బౌద్ధమత సిద్ధాంతుడు

అహింస, ప్రేమ... ప్రజాస్వామ్యానికి ప్రమాణాలని పేర్కొంటూ... నలంద విశ్వివిద్యాలయాన్ని ఉదహరించారు.
ప్రపంచమంతా ప్రాంతాల పేరుతో తరచూ అహింస కింద నలుగుతోందన్న ఆయన... మనం జాలి, దయలేకుండా మానసిక శాంతిని కోల్పోతున్నామని అభిప్రాయపడ్డారు. వాటిని వీడితే మానవ విలువలు తప్పకుండా అభివృద్ధి చెందుతాయని దలైలామా పేర్కొన్నారు.

చివరిరోజు దాకా కట్టుదిట్టమైన భద్రత...

బౌద్ధ సన్యాసి, నోబెల్​ శాంతి బహుమతి గ్రహీత అయిన దలైలామా 1959 లో భారతదేశంలో ఆశ్రయం పొందారు. ప్రస్తుతం 14 రోజుల సుదీర్ఘ పర్యటన సందర్భంగా ఆయనకు దేవాలయ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు.

ఇదీ చూడండి: ఆస్తుల ధ్వంసం మీ హక్కా?: 'పౌర' నిరసనకారులకు మోదీ ప్రశ్న

Last Updated : Dec 25, 2019, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details