తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐసీజే తీర్పుపై భారత్​ హర్షం.. విజయం తమదేనన్న పాక్​ - భారత విదేశాంగ మంత్రిత్వశాఖ

ఐసీజే (అంతర్జాతీయ న్యాయస్థానం)... కుల్​భూషణ్​ యాదవ్​ మరణశిక్షను బుధవారం నిలుపుదల చేసింది. ఆయనకు విధించిన మరణశిక్ష పునఃసమీక్షించాలని, అప్పటి వరకు శిక్ష అమలు చేయకూడదని పాకిస్థాన్​ను ఆదేశించింది. ఈ తీర్పును భారత్ స్వాగతించింది. ఇది భారత్​కు గొప్ప విజయంగా అభివర్ణించింది. మరోవైపు ఈ తీర్పు విషయంలో తాము చట్టం ప్రకారం నడుచుకుంటామని పాకిస్థాన్ స్పష్టం చేసింది.

ఐసీజే తీర్పుపై భారత్​ హర్షం.. విజయం తమదేనన్న పాక్​

By

Published : Jul 18, 2019, 5:58 AM IST

భారత మాజీ నౌకాదళ అధికారి కుల్​భూషణ్​ జాదవ్​ మరణశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును భారత స్వాగతించింది. ఇది భారత విజయంగా అభివర్ణించింది.

కుల్​భూషణ్ జాదవ్​ మరణశిక్షపై పునఃసమీక్ష చేయాలని, అతనికి న్యాయవాదితో సంప్రదించుకునే అవకాశాన్ని కలిగించాలని పాకిస్థాన్​ను ఐసీజే ఆదేశించింది. 'ఈ తీర్పు ఓ మైలురాయి' అని భారత విదేశాంగమంత్రిత్వశాఖ అభివర్ణించింది. ఐసీజే తీర్పును పాకిస్థాన్​ వెంటనే అమలు చేయాలని కోరింది.

జాదవ్​ విడుదలకు, భారత్​కు రప్పించడానికి భారత్ తీవ్రంగా కృషిచేస్తుందని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీశ్​కుమార్ తెలిపారు.
జాదవ్​ కుటుంబ సభ్యులకు ఓదార్పు..

ఐసీజే తీర్పు వెలువరించిన వెంటనే విదేశాంగమంత్రి జైశంకర్​.. జాదవ్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు.

చట్టం ప్రకారం నడుచుకుంటాం: పాక్​

ఐసీజే తీర్పుపై స్పందించిన పాకిస్థాన్...​ కుల్​భూషణ్ జాదవ్​ కేసు చట్టం ప్రకారం కొనసాగుతుందని పేర్కొంది. పాక్​​.. అంతర్జాతీయ సమాజంలో భాద్యతాయుతమైన సభ్యదేశంగా జాదవ్​ కేసు విషయంలో మొదటి నుంచి తన నిబద్ధతను కొనసాగిస్తూ ఉందని, ఆ దేశ విదేశాంగ కార్యాలయం తెలిపింది.

"ఐసీజే తీర్పు విన్న తరువాత, పాకిస్థాన్ ఇప్పుడు చట్టప్రకారం ముందుకుసాగుతుంది. జాదవ్​ను నిర్దోషిగా విడుదల చేయాలన్న భారత్ విజ్ఞప్తిని ఐసీజే ఆంగీకరించలేదు."- పాక్​ విదేశాంగ కార్యాలయం

కుల్​భూషణ్ జాదవ్... భారత ప్రామాణిక వీసా లేకుండా హుస్సేన్​ ముబారక్ పాటిల్​ అనే నకిలీ పేరుతో తమ దేశంలో ప్రవేశించాడని పాకిస్థాన్​ ఆరోపిస్తోంది. ఆయనపై గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలు మోపి, సైనిక న్యాయస్థానం ద్వారా ఉరిశిక్ష వేయాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆగ్రహించిన భారత్​... ఐసీజేను ఆశ్రయించింది. తాజాగా భారత్​కు అనుకూలంగా ఐసీజే తీర్పు వెలువరించింది.

ఇదీ చూడండి: అయోధ్య భూవివాదం కేసుపై నేడు సుప్రీం విచారణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details