చైనాలో కరోనా వైరస్ ఉద్భవించలేదని తాము చెప్పడం అత్యంత ఊహాజనితమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)లోని ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైక్ ర్యాన్ అన్నారు. అయితే, ప్రజారోగ్యాన్ని దృష్ట్యా మానవుల్లో మొదట వైరస్ బయటపడిన ప్రాంతం నుంచే దాని పుట్టుకపై పరిశోధన ప్రారంభించాలని అభిప్రాయపడ్డారు. ఆ పరిశోధన ఇతర ప్రాంతాలకూ విస్తరించొచ్చు అని ఆయన వెల్లడించారు. జెనీవాలో జరిగిన ఆన్‌లైన్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
చైనాలో కరోనా పుట్టలేదనడం ఊహే: డబ్ల్యూహెచ్‌ఓ - ప్రపంచ ఆరోగ్య సంస్థ
చైనా నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందలేదని మేము చెప్పడం అత్యంత ఊహాజనితమవుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అభిప్రాయపడింది. అయితే.. వైరస్ తొలుత బయటపడిన ప్రాంతం నుంచే కరోనా పుట్టుకపై అధ్యయనం జరగాలని పేర్కొంది.
![చైనాలో కరోనా పుట్టలేదనడం ఊహే: డబ్ల్యూహెచ్‌ఓ we cannot say corona virus is not spreaded from china sais WHO](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9694960-207-9694960-1606559686011.jpg)
చైనాలో కరోనా పుట్టలేదనడం ఊహే: డబ్ల్యూహెచ్‌ఓ
గతేడాది డిసెంబర్‌లో చైనాలోని ఆహార మార్కెట్‌లో మొదట కరోనా మహమ్మారిని గుర్తించారు. దానిపై వెంటనే సమాచారం ఇవ్వలేదని ప్రపంచ దేశాలు ఈ కమ్యూనిస్టు దేశంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనాకు డబ్ల్యూహెచ్‌ఓ వచ్చి కరోనా పుట్టుకపై అధ్యయనం చేయనుంది. ఈ క్రమంలో..ఆ వైరస్‌కు తమ దేశం జన్మస్థానం కాదంటూచైనా కొత్త వాదనను ప్రచారం చేస్తోంది. తొలుత ఈ వైరస్ వుహాన్ నగరంలో కనిపించినంత మాత్రాన అది ఇక్కడే పుట్టిందని చెప్పలేమని అంటోంది.