కొవిడ్ వ్యాప్తితో రెండుసార్లు వాయిదాపడ్డ శ్రీలంక పార్లమెంట్ ఎన్నికలు బుధవారం జరుగుతున్నాయి. 225 పార్లమెంట్ నియోజకవర్గాలకు గానూ.. 196 స్థానాల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మిగిలిన అభ్యర్థులను ఆయా పార్టీలు సాధించిన ఓట్ల నిష్పత్తి ఆధారంగా నామినేట్ చేస్తారు.
సుమారు 1.60 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో.. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటుచేసినట్లు ఆ దేశ ఎన్నికల కమిషన్ తెలిపింది.
ఓటింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం ముగియనుండగా.. గురువారం లెక్కింపు చేపడతారు. శుక్రవారం ఫలితాలు విడుదల కానున్నాయి.