చైనాలో మరోసారి కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. మయన్మార్ సరిహద్దులోని నైరుతీ చైనా నగరమైన రుయిలీలో 100కుపైగా కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో రుయిలీలో మొత్తం 3లక్షల మందికి టీకా అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఐదురోజుల వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభించారు.
ఈ నగరంలో ఆదివారం మరో 20 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్టు అక్కడి జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. బాధితుల్లో ఐదుగురికి వైరస్ లక్షణాలేవీ కనిపించలేదని పేర్కొంది.