ఇంట్లో పిల్లలుంటే ఆ సందడే వేరు. ఒకరిపై ఒకరు మీద పడి, కొట్టుకుని నానా హడావిడి చేస్తూ తల్లిదండ్రులకు కునుకు తీసే అవకాశాన్ని కూడా ఇవ్వరు. అమ్మ లేదా నాన్నా వారికి సద్దిచెప్పిన తర్వాత ఏమీ జరగనట్టు మళ్లీ కలిసిపోతారు. జంతువులూ ఇంతే! కొన్ని కొన్నిసార్లు మనిషికి ఏమాత్రం తీసిపోకుండా ప్రవర్తిస్తూ ఉంటాయి. చైనా ఏనుగుల గుంపునకు సంబంధించిన ఈ దృశ్యాలే ఇందుకు నిదర్శనం!
అచ్చం మనుషుల్లాగే!
యూన్నాన్ రాష్ట్రంలోని షువాంగ్బన్న నేషనల్ నేచర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న ఏనుగుల గుంపు చేష్టలు నెట్టింట వైరల్గా మారుతున్నాయి. తాజాగా.. ఓ గుంపులోని రెండు ఆడ ఏనుగులు గొడవపడ్డాయి. ఒకదాని వెంట మరోకటి పరిగెత్తి కొట్లాటకు దిగాయి. తోకలు నోట్లోపట్టుకుని నానా హడావిడి చేశాయి. ఆ తర్వాత ఓ మగ గజం మధ్యవర్తిత్వం చేసి వాటి మధ్య సయోధ్య కుదిర్చింది. రెండింటి మధ్య తన శరీరాన్ని అడ్డుపెట్టి సైగలు చేసింది.