భారత్, బ్రిటన్‌లలో కనిపించిన కరోనా వైరస్ సంకర రకం.. వియత్నాంను హడలెత్తిస్తోంది. దాదాపు 10 కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో ఇప్పటివరకు కరోనా టీకా తీసుకున్నది 10 లక్షల మంది కూడా లేరు. ఈ పరిస్థితుల్లో దేశంలో సగానికి పైగా భూభాగంలో సంకర రకం వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇది గాలిలో క్షణాల్లో వ్యాపిస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి న్యుయెన్ థాన్ లాంగ్ శనివారం చెప్పారు.
వియత్నాంలో తొలి విడతలోనే ఏడు రకాలైన కరోనా వైరస్ వ్యాప్తి చెందినా ఉద్ధృతికి చాలావరకు కళ్లెం వేసి ప్రశంసలు పొందింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిర్దిష్టంగా వీటి సంఖ్య ఎంత అనేది ప్రభుత్వం వెల్లడించలేదు. భారత్, బ్రిటన్‌లలో కనిపిస్తున్న రకాల హైబ్రిడ్ వేరియంట్ ప్రస్తుతం ఎక్కువ ప్రభావం చూపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్‌కు కళ్లెం వేయడంలో భాగంగా లాక్‌డౌన్ తరహా ఆంక్షలు విధించారు.
చైనా నగరంలో లాక్‌డౌన్