దుందుడుకు చైనా మరోసారి తెంపరితనం చూపించింది. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద దీవుల్లో ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, బాంబర్‌ను మోహరించింది. అక్కడి ప్రశాంత పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చింది. భారత్‌లో వియత్నాం రాయబారి ఫామ్ సన్ చౌ ప్రభుత్వానికి ఈ సమాచారం అందించారు. భారత్, వియత్నాం మధ్య బలమైన రక్షణ భాగస్వామ్యం అవసరమని నొక్కిచెప్పారు.
చాలా కాలంగా దక్షిణ చైనా సముద్రంలోని పార్సిల్ దీవులపై వివాదం నెలకొంది. అవి తమ ప్రాదేశిక ప్రాంతంలోనివే అని వియత్నాంను చైనా బెదిరిస్తోంది. కాగా వియత్నాంకు మద్దతుగా అమెరికా అక్కడ సైన్యాన్ని మోహరించింది. ఈ నేపథ్యంలో అక్కడి పెద్దదైన వుడీ దీవిలో 'హెచ్-6జే' బాంబర్‌ను చైనా ఈ నెలంతా మోహరిస్తుందని వార్తలు వచ్చాయి. అది యూఎస్ యుద్ధ విమానాల ప్రభావాన్ని తగ్గించగలదని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
భారత్‌కు ఫిర్యాదు..