ఆస్ట్రేలియా ప్రధానికి 'కార్చిచ్చు' సెగ- బాధితుల ఆగ్రహం ఆస్ట్రేలియాలో కార్చిచ్చుతో సర్వస్వం కోల్పోయిన బాధితులు ప్రధాని స్కాట్ మారిసన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్చిచ్చులో తీవ్రంగా దెబ్బతిన్న న్యూ సౌత్ వేల్స్‌లోని కోబార్గో ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఆసిస్ ప్రధాని వెళ్లగా.. బాధితులు అసభ్య పదజాలంతో దూషించారు. మంటలను అదుపు చేసేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేవని విమర్శించారు. ప్రధానితో కరాచలనం చేసేందుకు అగ్నిమాపక సిబ్బందిలోని ఒక వ్యక్తి నిరాకరించాడు.
బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు మారిసన్. ప్రజలకు అండగా నిలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని భరోసా ఇచ్చారు.
మరో 7రోజులు పరిస్థితి ఇంతే..
మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు వీస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో న్యూ సౌత్ వేల్స్‌లో ఏడు రోజుల పాటు అత్యవసర స్థితిని ప్రకటించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని, పర్యటకులు తక్షణం న్యూ సౌత్ వేల్స్‌ను వీడాలని ఆస్ట్రేలియా రవాణా మంత్రి సూచించారు. అగ్నిమాపక సిబ్బంది నిర్విరామ కృషితో కొన్ని ప్రాంతాల్లో మంటలు అదుపులోకి వచ్చాయి.
ఎంత అడవి కాలిపోయిందంటే
గ్యాస్ స్టేషన్లు, సూపర్ మార్కెట్లు తిరిగి తెరుచుకోవడం వల్ల వాటి ముందు ప్రజలు బారులు తీరారు. ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు వల్ల ఇప్పటి వరకు 12.35 మిలియన్ ఎకరాల అడవి కాలిపోగా 17 మంది మరణించారు.