కొవిడ్-19కు పుట్టినిళ్లుగా భావిస్తున్న చైనాలో తాజాగా మరో వైరస్ కలకలం రేపుతోంది. కోతుల నుంచి సంక్రమించే 'మంకీ బీ (Monkey B Virus)' మానవుల్లో తొలి కేసు నిర్ధరణ అయినట్లు చైనా వెల్లడించింది. ఈ వైరస్ సోకిన తొలి వ్యక్తి కూడా ఇతనేనని.. ఈ మధ్యే అతడు మరణించినట్లు ప్రకటించింది. అయితే, అతని సన్నిహితులకు మాత్రం ఎలాంటి లక్షణాలు లేవని.. వారందరూ సురక్షితంగానే ఉన్నట్లు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.
బీజింగ్‌కు చెందిన ఓ పశువైద్యుడు(57) జంతువులపై పరిశోధనలు జరుపుతున్నాడు. పరిశోధనలో భాగంగా మార్చి నెలలో రెండు చనిపోయిన కోతుల శరీరాలను ముక్కలుగా చేసి పరీక్షించాడు. అనంతరం ఆ పశువైద్యుడు అనారోగ్యానికి గురయ్యాడు. తొలుత వాంతి, వికారం వంటి లక్షణాలు కనిపించడంతో అతడు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స కోసం ప్రయత్నించాడు. కొన్ని రోజులకు అతడి ఆరోగ్యం మరింత క్షీణించింది. చివరకు మే 27న ప్రాణాలు కోల్పోయినట్లు చైనా అధికారులు వెల్లడించారు. అనంతరం అతడి నమూనాలను పరీక్షించగా మంకీ బీ వైరస్ (Monkey B Virus) పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. చైనాలో 'మంకీ బీ' సోకి ప్రాణాలు కోల్పోయిన తొలి వ్యక్తి ఇతనేనని చైనీస్ సీడీసీ (సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్- సీడీసీ) ప్రకటించింది. చైనాలో ఇంతకుముందు ఎన్నడూ ఈ వైరస్ సోకిన దాఖలాలు లేవని.. ఇదే తొలి కేసు అని వెల్లడించింది.
80శాతం మరణాల రేటు..