ఆస్ట్రేలియాలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి గ్రెగ్ హంట్ తెలిపారు. క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న టీకా ఇప్పటి వరకు ఆశాజనక ఫలితాలు కనబర్చిందని వెల్లడించారు. 2021 మూడో త్రైమాసికంలో ఈ వ్యాక్సిన్ ఆస్ట్రేలియాలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ఆస్ట్రేలియాలో 2021 మూడో త్రైమాసికానికి టీకా! - queensland university
ఆస్ట్రేలియాలో క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్నకరోనా టీకా వచ్చే ఏడాది మూడో త్రైమాసికంలో అందుబాటులోకి వస్తుందని ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్ తెలిపారు. ఈ మేరకు వ్యాక్సిన్ అభివృద్ధి వేగంగా జరుగుతోందని హంట్ పేర్కొన్నారు.
![ఆస్ట్రేలియాలో 2021 మూడో త్రైమాసికానికి టీకా! Vaccine will be available by 2021 third quarter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9532896-thumbnail-3x2-vaccine.jpg)
ఇప్పటి వరకు సాగిన ప్రయోగాల్లో కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే యాంటీబాడీలను ఈ టీకా ఉత్పత్తి చేసినట్లు హంట్ తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సోకే ముప్పు ఎక్కువగా ఉన్న వృద్ధుల్లో ఇది బాగా పనిచేస్తోందని పేర్కొన్నారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు అవసరమైన ఈ వ్యాక్సిన్ డోసులను ఇప్పటికే సీఎస్‌ఎల్ అనే ఔషధ తయారీ సంస్థ సిద్ధం చేసిందన్నారు. ఈ ప్రయోగాలు విజయవంతమై టీకా అందుబాటులోకి వస్తే 2021 చివరి నాటికి ఆస్ట్రేలియాలో ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. 5 కోట్ల 10 లక్షల డోసుల తయారీకి సీఎస్‌ఎల్ ఒప్పందం కుదుర్చుకొంది.
ఇదీ చూడండి:'దీపావళి వేళ చీకటి నుంచి వెలుగుల్లోకి..'