"ఉగ్రమూకల్ని అణచివేసేందుకు పాకిస్థాన్ తీసుకునే చర్యల్ని చూడాలనుకుంటున్నాం. దక్షిణాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గేలా జైషే మహ్మద్, లష్కరే తోయిబా సంస్థలపై చర్యలు చేపట్టాలి"-శ్వేతసౌధఅధికారి.
'మరోమారు భారత్ జోలికి వెళ్తే అంతే సంగతి' - pak
భారత్‌పై మరో ఉగ్రదాడికి జరిగితే పాకిస్థాన్‌కు ముప్పు తప్పదని అమెరికా హెచ్చరించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని పాక్‌కు సూచించింది.
పాకిస్థాన్‌కు అమెరికా హెచ్చరిక
కశ్మీర్‌లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ వాహనంపై జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ వైఖరిని అంచనా వేయడానికి ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించింది అమెరికా.
పాక్ గతంలో కొంతమంది ఉగ్రవాదుల్ని అరెస్టు చేసి మళ్లీ విడిచిపెట్టిన ఘటనలను గుర్తు చేసింది అగ్రరాజ్యం. పాకిస్థాన్ నుంచి మరిన్ని కఠిన చర్యలు ఆశిస్తున్నట్టు అమెరికా స్పష్టం చేసింది.
Last Updated : Mar 21, 2019, 4:14 PM IST