తెలంగాణ

telangana

ETV Bharat / international

మహమ్మారిని ఓడించి ప్రాణం నిలుపుతోంది! - corona latest news

లక్షాలాది ప్రాణాలు బలిగొన్న కరోనా మహమ్మారిని జయించేందుకు ఈసీఎంవోలు తోడ్పడతాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే, ఈసీఎంవోల ద్వారా చికిత్స అందించిన 32 మందిలో.. 22 మందికి ప్రాణగండం తప్పింది. మరో ఐదుగురు పూర్తిగా కోలుకున్నారు. ఇంతకీ ఏంటి ఈసీఎంవో?

use of extra corporal membrane oxygen or ecmo machines in covid 19 treatment
మహమ్మారిని ఓడించి.. ప్రాణం నిలుపుతోంది!

By

Published : May 20, 2020, 9:43 AM IST

కరోనా తీవ్రత పెరిగితే ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటుంది. దీని వల్ల వారి మెదడు, కాలేయం, ఇతర అవయవాలకు అవసరమైన ఆక్సిజన్‌ను రక్తం సరఫరా చేయలేకపోతుంది. వెరసి రోగి మృత్యువాత పడటం ఖాయం. ఇలాంటి విషమ పరిస్థితుల్లో ఉన్న కరోనా బాధితులకు చికిత్సలు అందించే క్రమంలో 'ఎక్స్‌ట్రా కార్పొరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజనేషన్ ‌(ఈసీఎంవో)' యంత్రం ప్రాణాధారం కాగలదని వెస్ట్‌ వర్జీనియా యూనివర్సిటీ పరిశోధకులు సూచించారు.

వయో వృద్ధులకు, అంతకుముందే ప్రమాదకర వ్యాధులు ఉన్న వారికి, గుండె పనితీరు క్షీణించిన వారికి ఈ యంత్రంతో తక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పారు. రోగి రక్తాన్ని ఈసీఎంవో యంత్రంలోకి పంపి, అక్కడ ఆక్సిజన్‌ను మిళితం చేసి, ఆ రక్తాన్ని మళ్లీ శరీరంలోకి పంపుతారు. దీని వల్ల రోగి ఊపిరితిత్తులు, కొన్నిసార్లు గుండెకు కొంత సమయం విశ్రాంతి లభించి, కోలుకునే అవకాశాలు పెరుగుతాయి.

వెంటిలేటర్ల ద్వారా అందించే చికిత్స సరిపోనప్పుడు ఈసీఎంవో యంత్రాలను వినియోగించవచ్చునని పరిశోధకులు తెలిపారు. కరోనా వల్ల ఊపిరితిత్తుల పనితీరు మందగించి, మృత్యువుతో పోరాడుతున్న 32 మందికి ఈసీఎంవో యంత్రం ద్వారా చికిత్స చేస్తే 22 మందికి ప్రాణాపాయం తప్పిందని, 5 పూర్తిగా కోలుకున్నారని వెల్లడించారు.

ఇదీ చదవండి:జ్వరం, దగ్గు లేకపోయినా కరోనా ఉండొచ్చు!

ABOUT THE AUTHOR

...view details