అఫ్గానిస్థాన్లో శాంతి కోసం తాలిబన్లు, అమెరికా మధ్య ఖతార్ వేదికగా చర్చలు జరుగుతున్నప్పుడే ఆ ఉగ్రసంస్థ దాడికి తెగబడింది. కాబుల్లో ఓ అంతర్జాతీయ సామాజిక సంస్థ కార్యాలయంలోకి చొరబడి బాంబులు పేల్చారు ఉగ్రవాదులు. ఈ దాడిలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
'కౌంటర్ పార్ట్ ఇంటర్నేషనల్' సామాజిక సంస్థపై దాడి జరిగిందని హోంమంత్రిత్వ శాఖ నిర్ధరించింది.
"కొంతమంది సాయుధులు సామాజిక సంస్థ పరిసరాల్లోకి చొచ్చుకెళ్లి బాంబుదాడి చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంస్థ చుట్టూ మోహరించారు. ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది."
-నస్రత్ రష్మీ, హోం శాఖ అధికార ప్రతినిధి
కార్యాలయంలోని 150 మంది సిబ్బందిని భద్రతా దళాలు రక్షించాయి.