నియంత్రణ రేఖతో పాటు ఇతర సెక్టార్లలో కాల్పులు విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని భారత్- పాకిస్థాన్ చేసిన సంయుక్త ప్రకటనను అమెరికా స్వాగతించింది. దక్షిణాసియాలో గొప్ప శాంతి, స్థిరత్వం సాధించడంలో ఇది ఓ సానుకూల చర్య అని పేర్కొంది. ఈ మేరకు శ్వేతసౌధ ప్రెస్ సెక్రెటరీ జెన్సాకి తెలిపారు.
"కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్, పాక్ చేసిన సంయుక్త ప్రకటనను అమెరికా స్వాగితిస్తోంది. దక్షిణాసియాలో గొప్ప శాంతిని సాధించే దిశలో ఇది కీలకమైన ముందడుగు. ఇందులో పురోగతి సాధించడానికి ఇరు దేశాలను మేము ప్రోత్సహిస్తాం. "