తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా హెచ్చరిక: చైనాతో పాక్​కు​ రుణభారమే - cpec news

సీపెక్​ నడవాతో పాకిస్థాన్ రుణ సంక్షోభం తీవ్రమవుతుందని హెచ్చరించింది అగ్రరాజ్యం.  చైనా పెట్టుబడి రుణాలను చెల్లించలేక పాక్​ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని అమెరికా తెలిపింది.

'సీపెక్'​తో పాక్​ ఆర్థిక సంక్షోభం తీవ్రతరం: అమెరికా

By

Published : Nov 22, 2019, 10:26 AM IST

చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా 'సీపెక్‌' ద్వారా పాక్​ మరింత రుణ సంక్షోభంలోకి వెళ్తుందని అమెరికా హెచ్చరించింది. డ్రాగన్​ దేశం భారీ మౌలిక సదుపాయాల కల్పన వల్ల స్వల్ప రాబడితో దీర్ఘకాలిక ఆర్థిక నష్టాన్ని పాకిస్థాన్ ఎదుర్కొంటుందని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల కార్యదర్శి ఆలిస్ వెల్స్ వివరించారు. చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలకు లాభాలను తెచ్చిపెట్టే ఫైనాన్సింగ్ రూపంగా సీపెక్​ను అభివర్ణించారు వెల్స్.

చైనా ప్రభుత్వ సంస్థలు బిలియన్ డాలర్లు పెట్టుబడుల రూపంలో పెట్టినప్పటికీ.. దీర్ఘకాలంలో చైనా పెట్టుబడి రుణాలను చెల్లించలేక పాక్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని వెల్స్​ హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా చైనా వస్తువులు పాకిస్థాన్​లోకి పెద్దఎత్తున దిగుమతి అవడమే కాకుండా స్థానికుల ఉపాధి అవకాశాలను చైనా కార్మికులు సొంతం చేసుకుంటారని వెల్స్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: గ్రెటా థన్​బర్గ్​కు 'అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి'

ABOUT THE AUTHOR

...view details