1959 నుంచి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త దలైలామాకు ఆతిథ్యమిస్తున్నందుకు భారత్కు ధన్యవాదాలు తెలిపింది అమెరికా. జులై 6న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖలోని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల బ్యూరో ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది.
''తన శాంతి బోధనల ద్వారా ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిన దలైలామాకు 85వ పుట్టినరోజు శుభాకాంక్షలు. టిబెటన్ల పోరాటం, వారి వారసత్వానికి ఒక గుర్తుగా నిలిచారు. 1959 నుంచి దలైలామాకు, టిబెటన్లకు ఆతిథ్యమిస్తున్న భారత్కు కృతజ్ఞతలు.''
- అమెరికా విదేశాంగ శాఖ ఎస్సీఏ బ్యూరో ట్వీట్
అమెరికా చట్ట సభ సభ్యులు, స్పీకర్ నాన్సీ పెలోసీ సహా పలువురు ప్రముఖులు దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.