తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 99లక్షలు దాటిన కరోనా కేసులు - corona in china

ప్రపంచ దేశాలపై కరోనా పంజా విసురుతోంది. కొవిడ్​-19 ధాటికి సుమారు 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 99 లక్షలు దాటింది. 53 లక్షల మందికిపైగా కోలుకున్నారు. చైనా, దక్షిణ కొరియాలో వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది

US states reimpose virus restrictions
ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి పంజా

By

Published : Jun 27, 2020, 10:49 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటికి చేరువైంది. రోజుకు వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులతో పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య దాదాపు 5 లక్షలకు చేరువైంది. కేసులు, మరణాల పరంగా అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. కేసుల పరంగా బ్రెజిల్​, రష్యా, భారత్​, బ్రిటన్​లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అమెరికాలోని పెద్ద రాష్ట్రాలైన టెక్సాస్​, ఫ్లోరిడాలో మళ్లీ ఆంక్షలు విధించాయి స్థానిక ప్రభుత్వాలు. దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే 40వేలకు పైగా కేసులు నమోదైన నేపథ్యంలో.. బార్లు తెరిచి ఉంచడమే కేసుల పెరుగుదలకు కారణంగా పేర్కొంటూ వాటిని మూసివేశారు.

చైనా, దక్షిణ కోరియాలో మళ్లీ విజృంభణ..

వైరస్​కు పుట్టినిల్లు చైనాలో కొవిడ్​-19 మళ్లీ విజృంభిస్తోంది. శనివారం ఒక్క రోజే 21 కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్​ వెల్లడించింది. అందులో 17 రాజధాని బీజింగ్​లో ఉన్నట్లు తెలిపింది. హోల్​సెల్​ ఫుడ్​ మార్కెట్లు, పాఠశాలల మూసివేశారు. పలు ప్రాంతాల్లో లాక్​డౌన్​ విధించారు అధికారులు.

వైరస్​ కట్టడిలో విజయవంతమైనట్లు ప్రకటించుకున్న దక్షిణ కొరియాలో వైరస్​ మళ్లీ పంజా విసురుతోంది. శనివారం కొత్తగా 51 కేసులు నమోదయ్యాయి. అందులో 35 రాజధాని సియోల్​లోనే బయటపడ్డాయి. మొత్తం కేసుల సంఖ్య 12,653, మరణాల సంఖ్య 282కు చేరింది.

వివిధ దేశాల్లో కరోనా కేసుల వివరాలు

ఇదీ చూడండి: 'కొవిడ్​-19 వ్యాక్సిన్​ అభివృద్ధికి భారీ బడ్జెట్ అవసరం'​

ABOUT THE AUTHOR

...view details