తెలంగాణ

telangana

ETV Bharat / international

వెన్ను తట్టింది-వెన్ను విరిచింది: తాలిబన్లతో అమెరికా తీరిదే - afghanistan taliban war

అఫ్గాన్​ యుద్ధంలో అమెరికాది భిన్న వైఖరి. రష్యాకు వ్యతిరేకంగా తన సొంత ఉగ్రవాదులపైనే పోరాటం చేయాల్సివచ్చింది. దీనికి కారణం.. 2001 లో జరిగిన న్యూయార్క్​ ఉగ్రదాడే. ఈ దాడుల్లో అల్​ఖైదా ఉగ్రవాదులు.. ఆ సంస్థ అధినేత ఒసామా బిన్​లాడెన్​కు అఫ్గాన్ తాలిబన్​ ప్రభుత్వం ఆశ్రయమిచ్చినందున పరిస్థితులన్నీ మారాయి.

AMERICA SHOWS DIFFERENT ATTITUDE
తాలిబన్లతో అమెరికా వ్యవహార తీరు

By

Published : Mar 1, 2020, 7:46 AM IST

Updated : Mar 3, 2020, 12:51 AM IST

అఫ్గాన్‌ యుద్ధంలో అమెరికాది విచిత్రమైన పాత్ర. సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా తాను పెంచి పోషించిన ఉగ్రవాదులపైనే 18 ఏళ్లకుపైగా పోరాటం చేయాల్సి వచ్చింది. 2001 సెప్టెంబరు 11 న న్యూయార్క్‌లో జరిగిన ఉగ్రదాడే ఇందుకు ప్రధాన కారణం. ఆ దాడులు చేసిన అల్‌ఖైదా ఉగ్రవాదులు, ఆ సంస్థ అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌కు అఫ్గాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వం ఆశ్రయం ఇవ్వడం వల్ల సమీకరణాలు మారాయి. ‘శాశ్వత స్వేచ్ఛ’(ఎండ్యూరింగ్‌ ఫ్రీడమ్​) పేరుతో నాటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌... అఫ్గాన్‌లోని ఉగ్రవాదులపై యుద్ధం ప్రకటించారు.

వెయ్యి నుంచి పదివేలకు...

2001 నవంబరులో తొలుత వెయ్యిమంది అమెరికా సైనికులు వెళ్లగా.. మరుసటి ఏడాదికి ఆ సంఖ్య పదివేలకు పెరిగింది. 2003 లో ఇరాక్‌ పాలకుడు సద్దాం హుస్సేన్‌పై అమెరికా దృష్టి పెట్టినందున మళ్లీ తాలిబన్లు పుంజుకొన్నారు. పాకిస్థాన్‌లోని గిరిజన ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతూ యుద్ధం చేయడం ప్రారంభించారు. ఫలితంగా 2008 లో అమెరికా 48,500 మంది సైనికులను పంపించింది. 2009లో అధికారంలోకి వచ్చిన ఒబామా మరో 30 వేలమందిని పంపించారు. 2010లో మొత్తం 1.50 లక్షల మంది విదేశీ సైనికులు ఉండగా.. వారిలో లక్ష మంది అమెరికన్లే కావడం గమనార్హం.

వ్యూహం మార్చిన అమెరికా...

2011 మే 2న పాకిస్థాన్‌లో ఒసామా బిన్‌ లాడెన్‌ను హతమార్చిన దగ్గర నుంచి ఉద్రిక్తతలు తగ్గాయి. 2014లో యుద్ధాన్ని విరమిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. సైనికులను వెనక్కి పంపించినా అఫ్గాన్‌ దళాలకు శిక్షణ పేరుతో 12,500 మంది విదేశీ సైనికుల(9,800 మంది అమెరికన్లు)ను అక్కడే ఉంచింది. 2015 నుంచి మరో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రభావం పెరగడం వల్ల అమెరికా మళ్లీ వ్యూహాన్ని మార్చుకొంది. 8,400 మంది సైనికులను అక్కడే ఉంచింది. డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారం చేపట్టాక 2017 లో మరో మూడువేల మందిని పంపించారు. యుద్ధానికి ముగింపు పలకాలన్న ఉద్దేశంతో సైనికుల సంఖ్యను పూర్తిగా తగ్గిస్తామని చెప్పి ఆ మేరకు ఒప్పందం కుదిరేలా చూశారు.

ఇదీ చదవండి:నాలుగు దశాబ్దాల పోరు..'లీపు' రోజున కొలిక్కి..!

Last Updated : Mar 3, 2020, 12:51 AM IST

ABOUT THE AUTHOR

...view details