అమెరికా పాత్రికేయుడు డానియేల్ పెరల్ హత్య కేసులో పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా, ఐరాస ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గింది. సుప్రీం తీర్పును పునఃసమీక్ష కోసం సింధ్ రాష్ట్ర యంత్రాంగం చేస్తున్న చర్యల్లో తామూ భాగస్వాములం అవుతామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. సింధ్ ప్రభుత్వం దాఖలు చేసిన పటిషన్లో తమను కూడా కక్షిదారుగా చేర్చుకోవాలని తగిన అప్లికేషన్‌ను సుప్రీంకోర్టుకు అందివ్వనున్నట్టు పాక్ అటార్నీ జనరల్ ప్రతినిధి తెలిపారు.
తలొగ్గిన పాక్.. 'డానియేల్' తీర్పుపై సమీక్ష - daniel pearl case virdict review in pak supreme court
డానియేల్ పెరల్ హత్య కేసులో తమ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో.. అమెరికా, ఐరాస నుంచి పాకిస్థాన్ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తీర్పును పునఃసమీక్షించేందుకు సింధ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో తాము కూడా పాలుపంచుకుంటామని ప్రకటించింది.

డానియెల్ పెరల్ హత్య కేసులో పాక్ జవాబుదారితనం
2020లో.. పాకిస్థాన్ నిఘా సంస్ధ ఐఎస్ఐ, అల్‌ఖైదాకు మధ్య సంబంధాలపై పరిశోధన చేస్తుండగా ఉగ్రవాదులు.. అమెరికా వాల్‌స్ట్రీట్ పత్రికకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు డానియేల్ పెరల్ను అపహరించి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు అల్‌ఖైదా ఉగ్రవాది అహ్మద్ ఒమర్ సయీద్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఈ నెల 28న తీర్పు వెలువరించింది. దీనిపై అమెరికా, ఐక్యరాజ్య సమితి ఆగ్రహం వ్యక్తం చేశాయి.