తెలంగాణ

telangana

ETV Bharat / international

'అణ్వస్త్ర రహిత దేశంగా నిరూపించుకుంటేనే...' - విదేశాంగ మంత్రి

అమెరికా, ఇరాన్​ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇరాన్​తో చర్చల అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో మాటమార్చారు. అణ్వస్త్ర రహిత దేశంగా ఇరాన్​ నిరూపించుకుంటేనే షరతులు లేకండా చర్చలు జరుపుతామన్నారు.

'అణ్వస్త్ర రహిత దేశంగా నిరూపించుకుంటేనే...'

By

Published : Jun 3, 2019, 6:27 AM IST

'అణ్వస్త్ర రహిత దేశంగా నిరూపించుకుంటేనే...'

ఇరాన్‌తో చర్చల అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో మాటమార్చారు. తొలుత ఎలాంటి ముందస్తు షరతులు లేకుండానే టెహ్రాన్​తో చర్చలను సిద్ధమని ప్రకటించిన ఆయన.. తన వ్యాఖ్యలను సవరించుకున్నారు.

అణ్వస్త్ర రహిత దేశంగా ఇరాన్ నిరూపించుకుంటేనే షరతులు లేకుండా చర్చలు జరుపుతామన్నారు పాంపియో. అయితే.. ఇరు దేశాల మధ్య కొద్ది కాలంగా నెలకొన్న పరిస్థితుల్ని చూస్తే ఈ అంశం ప్రయోజనం కలిగించేదే. అమెరికా చర్య... ద్వైపాక్షిక సంబంధాల మెరుగుకు కృషి చేస్తుందని భావిస్తున్నారు విశ్లేషకులు.

ఇరాన్‌ అణ్వస్త్ర కార్యక్రమంపై విధించిన ఆంక్షల ఎత్తివేతకు సంబంధించి ఏం మాట్లాడలేదు పాంపియో. ఇరు దేశాల మధ్య మర్యాదపూర్వకమైన చర్చలు జరగాలని ఇరాన్​ అధ్యక్షుడు హసన్​ రౌహానీ వ్యాఖ్యానించిన అనంతరం ఇలా మాట్లాడారు పాంపియో.

ఇరాన్​ నో...

అమెరికా తరఫున పాంపియో చర్చల ప్రతిపాదనను ఇరాన్‌ తోసిపుచ్చింది. ఇరాన్‌పై అమెరికా వైఖరి, చర్యల్లో మార్పు వస్తే గానీ చర్చలు జరిగే అవకాశం లేదని టెహ్రాన్​ ప్రతినిధి స్పష్టం చేశారు.

కొంత కాలంగా ఇరాన్​, అమెరికా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 2015 అణు ఒప్పందం నుంచి అమెరికా స్వచ్ఛందంగా వైదొలగిన అనంతరం ఈ పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్​పై మరిన్ని ఆంక్షలు విధిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇరాన్​ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details