భారత్-పాకిస్థాన్ బంధంపై అమెరికా స్పందించింది. తమ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరిచుకునేందుకు ఇరు దేశాలు ప్రత్యక్షంగా చర్చలు జరుపుకుంటే.. అందుకు తాము మద్దతిస్తామని అగ్రరాజ్యం వెల్లడించింది.
అయితే.. భారత్ నుంచి చక్కెరను దిగుమతి చేసుకోకూడదన్న పాక్ కేబినెట్ నిర్ణయంపై స్పందించేందుకు మాత్రం నిరాకరించింది అగ్రరాజ్యం.
"చక్కెర దిగుమతి అంశంపై నేను స్పందించను. అయితే.. సమస్యలను పరిష్కరించుకునేందుకు భారత్-పాకిస్థాన్ ప్రత్యక్ష చర్చలు జరిపితే.. దానికి అమెరికా మద్దతు ఉంటుంది."
--- నెడ్ ప్రైస్, అమెరికా విదేశాంగ ప్రతినిధి