అఫ్గానిస్థాన్ వ్యవహారంలో అమెరికా(US afghanistan)కు ఏదీ కలిసిరావడం లేదు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా బెడిసి కొడుతోంది. దళాలు హడావుడిగా వెనుదిరగడం(US afghanistan withdrawal) నుంచి ఇప్పటివరకు అగ్రరాజ్య వైఖరిలో ఎన్నో లోపాలు ఉన్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి మరింత బలం చూకూరుస్తూ.. అమెరికాకు సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. ఇన్నేళ్లు తమకు సహాయం చేసిన అఫ్గానీల పేర్లతో కూడిన ఓ జాబితాను స్వయంగా అమెరికా వెళ్లి తాలిబన్ల చేతికి ఇచ్చినట్టు తెలుస్తోంది.
'కిల్ లిస్ట్..'
కాబుల్‌ను తాలిబన్ల వశమైన అనంతరం వారికి అమెరికా ఓ జాబితాను అందించిందని ఓ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. అందులో అమెరికా పౌరులు, గ్రీన్‌కార్డ్ హోల్డర్లు, ఇన్నేళ్లు తమకు సహాయం చేసిన అఫ్గాన్ ప్రజల వివరాలు ఉన్నాయి. ఈ జాబితాను తాలిబన్లకు అందిస్తే, ప్రజల తరలింపు ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని అగ్రరాజ్యం భావించింది. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగినట్టు తెలుస్తోంది.
ఇన్నేళ్లు అమెరికాకు సహాయం చేసిన అఫ్గానీలను వెంటాడి వేటాడుతున్నారు తాలిబన్లు. అందరినీ క్షమిస్తున్నామని బయటకు చెబుతూనే.. ఇళ్లు, కార్యాలయాలను తనిఖీ చేసి, ఇన్నేళ్లు తమకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టిన వారిని పట్టుకుంటున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు.. స్వయంగా అమెరికానే వెళ్లి తాలిబన్ల(taliban news latest)కు జాబితా ఇవ్వడం గమనార్హం. ఈ జాబితాను తాలిబన్లు 'కిల్ లిస్ట్'గా పరిగణించే ప్రమాదం ఉంది.
ఇదీ చూడండి:-ISIS Kabul Attack: ఏంటీ ఐసిస్-కే? తాలిబన్లకు శత్రువా?
ఈ జాబితా వ్యవహారాన్ని బైడెన్ ఖండించకపోవడం(biden on afghanistan) గమనార్హం. తనకు ఎలాంటి సమాచారం లేదని మాత్రామే ఆయన వ్యాఖ్యానించారు.
అమెరికా నిర్ణయంపై ఆ దేశ చట్టసభ్యులు, మిలిటరీ అధికారులు తీవ్రంగా మండిపడుతున్నారు. జాబితాలో ఉన్న అఫ్గానీల ప్రాణాలకు ముప్పుపొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.