తెలంగాణ

telangana

ETV Bharat / international

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ పరిస్థితి విషమం!

శస్త్రచికిత్స అనంతరం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్ పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు వస్తోన్న వార్తలను అమెరికా నిఘా వర్గాలు పరిశీలిస్తున్నాయి. అయితే ఉత్తర కొరియాలో అలాంటి వార్తలు ఏమీ లేవని సియోల్​ అధికారులు తెలిపారు.

US official says Kim Joung Un in grave danger after surgery
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ పరిస్థితి విషమం!

By

Published : Apr 21, 2020, 11:06 AM IST

కొన్ని రోజులుగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్​ ఉన్​ జాడ ఎక్కడా కనిపించడం లేదు. ఆయనకు సంబంధించిన వార్తలు ఏవీ రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కిమ్‌ ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అతడి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాలేదని తెలుస్తోంది.

కిమ్‌ ఆరోగ్య పరిస్థితిపై వస్తోన్న వార్తలను అమెరికా నిఘా​ వర్గాలు పరిశీలిస్తున్నాయి. అయితే ఉత్తర కొరియాలో ఎటువంటి అనుమానాస్పద చర్యలను గుర్తించలేదని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం బ్లూ హౌస్​ పేర్కొంది.

ప్రస్తుతం కిమ్​ ఆరోగ్య పరిస్థితి ఏంటనే విషయంపై స్పష్టత ఇవ్వలేమని బ్లూ హౌస్​ తెలిపింది. అయితే కిమ్ ఆరోగ్యంపై వస్తోన్న కథనాలు వాస్తవమేనని అమెరికా అధికారి ఒకరు స్పష్టం చేశారు. గతంలో రాజధాని ప్యాంగ్యాంగ్​లో కిమ్​.. శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నట్లు ఓ వార్తా సంస్థ ప్రచురించింది.

ఏప్రిల్​ 15న ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, తన తాతైన కిమ్​ ఇల్​ సుంగ్​ జయంతి వేడుకలకు ఏటా హాజరయ్యే కిమ్​.. ఈ సారి రాకపోవడం వల్ల ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. కిమ్​ చివరిసారిగా ఏప్రిల్​ 11న మీడియా ముందుకు వచ్చారు. దేశంలో వైరస్​ ప్రబలకుండా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details