తెలంగాణ

telangana

ETV Bharat / international

అరేబియా సముద్రంలో భారీ స్థాయిలో ఆయుధాలు స్వాధీనం

అరేబియా సముద్రంలో తీవ్రవాదుల కోసం ఆయుధాలను తరలిస్తున్న ఓ నౌకను అమెరికా నావికాదళం స్వాధీనం చేసుకొంది. ఇవి ఎక్కడ నుంచి బయలుదేరాయన్నది తెలియనప్పటికీ.. యెమెన్​లో పోరాటం చేస్తున్న హౌతీ తీవ్రవాదుల కోసం ఉద్దేశించినవని అధికారులు భావిస్తున్నారు.

US navy
అరేబియా సముద్రంలో ఆయుధాలు స్వాధీనం

By

Published : May 10, 2021, 7:56 AM IST

తీవ్రవాదుల కోసం ఆయుధాలు తీసుకొని వెళ్తున్న ఓ నౌకను అమెరికా నావికాదళం స్వాధీనం చేసుకొంది. ఇవి ఎక్కడ నుంచి బయలుదేరాయన్నది తెలియరాలేదు. పాకిస్థాన్- ఒమన్ దేశాల మధ్య ఉత్తర అరేబియా సముద్రంలో ఆదివారం దీనిని పట్టుకున్నట్టు అమెరికా వర్గాలు తెలిపాయి. సరిగ్గా ఎక్కడన్నది వెల్లడించకపోయినా పాక్​కు సమీపంలో ఆ దేశ జలాల్లోనే పట్టుకొని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. వీటిని ఎక్కడికి తీసుకెళ్తున్నదీ తెలియనప్పటికీ యెమెన్​లో పోరాటం చేస్తున్న హౌతీ తీవ్రవాదుల కోసం ఉద్దేశించినవని భావిస్తున్నారు.

అరేబియా సముద్రంలో ఆయుధాలు స్వాధీనం

ఆధునిక ఆయుధ సామగ్రి..

ప్రాథమిక దర్యాప్తులో ఇవి ఇరాన్ నుంచి బయలుదేరినట్టు అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో 3000 చైనా తరహా కె-56 రైఫిళ్లు, రష్యాలో తయారైన ట్యాంకులపై దాడులు చేసే గైడెడ్ మిసైళ్లు, వందలాది భారీ తరహా మిషన్ గన్లు, రాకెట్ ఆధారిత గ్రెనేడ్ లాంఛర్లు, స్నైపర్ రైఫిల్స్, ఇతర ఆధునిక ఆయుధ సామగ్రి ఉంది. మధ్యప్రాచ్యంలో భద్రత వ్యవహారాలు చూసే అమెరికా ఫిఫ్త్​ ఫ్లీట్​కు చెందిన 'యూఎస్ఎస్ మాంటేరీ' నౌక సాయంతో వీటిని పట్టుకున్నారు.

యెమెన్​లో ప్రభుత్వ దళాలు, హౌతీ ఉగ్రవాదుల మధ్య 2014 నుంచి పోరాటం జరుగుతోంది. దీంట్లో ఇంతవరకు 1.30 లక్షల మంది మరణించారు.

ఇదీ చూడండి:చైనా దౌత్యవేత్తలను భయపెట్టిన 'అతడు'!

ఇదీ చూడండి:అమెరికాలో మూడు చోట్ల కాల్పులు- నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details