తెలంగాణ

telangana

ETV Bharat / international

మయన్మార్​ సంస్థపై అమెరికా ఆంక్షలు - మయన్మార్​ సైనిక ప్రభుత్వంపై అమెరికా ఆగ్రహం

మయన్మార్​లో సైనిక ప్రభుత్వ దుశ్చర్యలపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశానికి చెందిన ఓ సంస్థపై ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొంది.

US sanctions on myanmar
మయన్మార్​ సంస్థపై అమెరికా ఆంక్షలు

By

Published : Apr 9, 2021, 6:05 AM IST

మయన్మార్​ సైనిక ప్రభుత్వ అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ఓ వ్యాపార సంస్థపై ఆంక్షలు విధించింది అమెరికా. 'జెమ్స్​ ఎంటర్​ప్రైసెస్'​ సంస్థపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ జే బ్లింకన్ పేర్కొన్నారు. సైనిక చర్యను వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మయన్మార్​పై అమెరికా మరింత ఒత్తిడి పెంచనుందని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలంటూ వేల సంఖ్యలో మయన్మార్​ ప్రజలు నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైనిక ప్రభుత్వం ప్రజలపై కఠినంగా ప్రవర్తిస్తోంది. వారిపై వైమానిక దాడులు జరుపుతోంది. మార్చి 27న సైనిక ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయంతో దాదాపు 100 మంది ప్రజలు అసువులు బాసారు. ఇప్పటివరకు మొత్తంగా 500 మంది మృతిచెందారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా పలు ఆంక్షలు విధిస్తోందని బ్లింకెన్ తెలిపారు.

ఇదీ చదవండి:ఒకే ఆసుపత్రిలో 37 మంది వైద్యులకు కరోనా

ABOUT THE AUTHOR

...view details