తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో 10 రోజుల్లో 10 లక్షల కరోనా కేసులు - Coronavirus death toll latest

ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు సంఖ్య 5 కోట్ల 18 లక్షలు దాటింది. వైరస్ ధాటికి మరణించివారి సంఖ్య లక్షా 28 వేలకు చేరువలో ఉంది. ఐరోపా దేశాలు సహా అమెరికాలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది.

US has 1M new coronavirus cases this month
అమెరికాలో పదిరోజుల్లో 10లక్షల కరోనా కేసులు

By

Published : Nov 11, 2020, 10:31 AM IST

కరోనా వ్యాప్తి తగ్గినట్లే తగ్గి... మళ్లీ ఒక్కసారిగా విజృంభిస్తోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 5 కోట్ల 18 లక్షలు దాటింది. ఇప్పటివరకు లక్షా 29 వేల 500మందికి పైగా కొవిడ్​తో మరణించారు.

పది రోజుల్లో 10 లక్షల కేసులు

అమెరికాలో నవంబర్​ నెల ప్రారంభం నుంచి కేవలం పదిరోజుల్లో 10 లక్షల కేసులు బయటపడ్డాయి. అంటే రోజూ సగటున లక్ష కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తిని నివారించేందు కఠిన చర్యలు చేపడుతున్న విస్కాన్సిన్​, ఇల్లినాయీ​ రాష్ట్రాల్లోనే భారీగా కేసులు నమోదుకావడం గమనార్హం. ఫలితంగా కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్కరోజే లక్షా 35 వేల మంది కరోనా బారిన పడ్డారు. మరో 1,345మంది మృతి చెందారు.

ఐరోపా దేశాల్లో కరోనా బాధితులు విపరీతంగా పెరుగుతున్నారు. ఇటలీ, ఫ్రాన్స్​, బ్రిటన్​ సహా పలు దేశాల్లో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి.

దేశం కేసులు మరణాలు
అమెరికా 1,05,59,184 2,45,799
బ్రెజిల్ 57,01,283 162,842
ఫ్రాన్స్ 18,29,659 42,207
రష్యా 18,17,109 31,161
స్పెయిన్​ 1,443,997 39,756
అర్జెంటీనా 12,62,476 34,183
బ్రిటన్​ 12,33,775 49,770
ఇటలీ 9,95,463 42,330

ఇదీ చూడండి:'ఓటమిని ఒప్పుకోకపోవడం అధ్యక్ష హోదాకు సరికాదు'

ABOUT THE AUTHOR

...view details